8 బ్యాంకుల లైసెన్సులు రద్దు చేస్తూ RBI సంచలన నిర్ణయం… ఏవంటే?

RBI (రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.ఈసారి ఏకంగా 8 బ్యాంకులపైన వేటు వేసింది.

 8 బ్యాంకుల లైసెన్సులు రద్దు చే-TeluguStop.com

అవును, వాటి లైసెన్సులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.సదరు బ్యాంకుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆర్బీబీ రంగంలోకి దిగి, సదరు బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది.8 సహకార బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయగా.వాటిల్లో ముధోల కో ఆపరేటివ్ బ్యాంక్, శ్రీ ఆనంద్ కోఆపరేటివ్ బ్యాంక్( Co-operative Bank, Shri Anand Co-operative Bank ), మిలాత్ కో ఆపరేటివ్ బ్యాంక్, రూపి కో ఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ కో ఆపరేటివ్ బ్యాంక్, దక్కన్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్, సేవా వికాస్ కో ఆపరేటివ్ బ్యాంక్, బాబాజీ డేట్ ఉమెన్స్ అర్టన్ బ్యాంక్ ఉన్నాయి.

ఆయా బ్యాంకుల్లో తగిన మూలధనం లేకపోవడం కావచ్చు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం కావచ్చు, అదేవిధంగా బ్యాంకుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా( Reserve Bank of India ) తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా, భవిష్యత్తులో ఆదాయం తగ్గే అవకాశం ఉన్నందున కూడా లైసెన్సులను రద్దు చేసినట్టు సమాచారం.అలాగే నిబంధనలను ఉల్లంఘించినందుకు మరికొన్ని బ్యాంకులకు ఆర్బీఐ భారీగా జరిమానాలు విధించింది.

సెంట్రల్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులకు భారీగా జరిమానాలు విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.నిబంధనలు పాటించని బ్యాంకులకు 114 సార్లు జరిమానా వేసింది.గత ఆర్ధిక సంవత్సరంలో 8 సహకార బ్యాంకుల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు ఇపుడు మరికొన్నింటికి ఫైన్ వేశారు.

కాగా సహకార బ్యాంకులను బలోపేతం చేయడంపై ఆర్‌బీఐ( RBI ) దృష్టి పెట్టింది.అందులో భాగంగా సహకర బ్యాంకులపై నిఘా పెట్టింది.ఆయా బ్యాంకుల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని గుర్తించింది.దీని వల్ల అక్రమాలు విరివిగా జరుగుతున్నట్లు గుర్తించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube