అవును, మీరు విన్నది నిజమే.పెన్షన్( Pension ) కోసం ఓ వృద్ధ మహిళ ( old woman )విరిగిన కుర్చీ సాయంతో చెప్పుల్లేకుండా కిలోమీటర్ల దూరం నడిచిన ఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఆమె వయస్సు 70 అని తెలుస్తోంది.అంతకష్టపడి ఆమె కొన్ని కిలోమీటర్లు నడిచినా పెన్షన్ సొమ్ము విత్‌డ్రా చేసుకోలేకపోయింది.
వివరాల్లోకి వెళితే, ఒడిషాలోని నవరంగపూర్ జిల్లా జరిగావ్ బ్లాక్‌లో ఏప్రిల్ 17న ఈ ఘటన చోటుచేసుకుంది.పశువుల కాపరిగా పనిచేసే కుమారుడి వద్ద నివసిస్తున్న వృద్ధురాలు పెన్షన్ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ఎస్‌బీఐ బ్రాంచ్( SBI Branch )కు కిలోమీటర్ల కొద్దీ కాలినడకన చేరుకుంది.

అయితే ఆమె తీరా బ్యాంకుకి వెళ్ళాక ఆమె వేలిముద్ర రికార్డులతో మ్యాచ్ కాకపోవడంతో మహిళకు పెన్షన్ సొమ్ము ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు ససేమిరా అన్నారు.వృద్ధాప్యంతో ఆమె వేళ్లకు పగుళ్లు రావడంతో వేలిముద్ర రికార్డులతో సరిపోలలేదని సమాచారం.అయితే దీనికి పరిష్కారం అన్వేషిస్తున్నామని బ్యాంకు సిబ్బంది తెలిపారు.ఇక ఇదే విషయం సోషల్ మీడియాలో విరివిగా షేర్ అయ్యి అది కాస్త బ్యాంకు యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు సర్దుకున్నారు.

ఈ క్రమంలో బ్యాంకు నుంచి ఆమెకు రూ.3000 సర్దుబాటు చేశామని చెప్పుకొచ్చారు.అయితే ఆమె సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జరిగావ్ బ్రాంచ్ ఎస్‌బీఐ మేనేజర్ ఈ సందర్భంగా చెప్పుకు రావడం హర్శించదగ్గ విషయం.ఇదే ఘటనపైన గ్రామ సర్పంచ్ స్పందిస్తూ….
గ్రామంలో పెన్షన్ కోసం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి జాబితాను రూపొందించి వారికి పెన్షన్ సజావుగా ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.ఇదంతా సోషల్ మీడియా మహిమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.







