అజయ్ ఘోష్, చాందినీ చౌదరీలు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి.( Music Shop Murthy ) ఈ మూవీని శివ పాలడుగు తెరకెక్కించాడు.
ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు.టీజర్, ట్రైలర్ చూస్తే ఈ చిత్రం ఎమోషనల్‌గా ఉంటుందని అర్థమైంది.
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ప్రమోషన్స్‌లో చెబుతూనే వచ్చారు.మరి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది.ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
వినుకొండలో 50 ఏళ్లు వచ్చిన మూర్తి(అజయ్ ఘోష్)( Ajay Ghosh ) ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు.కాలం మారి నేటి ట్రెండ్‌లో పాటలు వినే పద్దతులు మారినా కూడా మూర్తి పాత కాలంలా క్యాసెట్లు అద్దెకిచ్చి, పాటలు ఎక్కించడం, ఫంక్షన్స్ కి సౌండ్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేయడం చేస్తూ ఉంటాడు.ఇక మూర్తి సంపాదనతో ఇంటిని ముందుకు సాగించడం కష్టమని, అతని భార్య (ఆమని)( Aamani ) కూడా కష్టపడుతూ ఉంటుంది.
అయితే డీజేగా మారి మ్యూజిక్ కొడితే డబ్బులు ఎక్కువగా వస్తాయని తెలుసుకుంటాడు మూర్తి.దాంతో డీజే అవ్వాలని అనుకుంటాడు.మరో వైపు అంజనా(చాందిని) కూడా డీజే అవ్వాలని అనుకుంటుంది.కానీ ఓ ఆడిపిల్ల అలా పబ్బుల్లో డీజే వాయించడం ఏంటి? అని ఆమె తండ్రి(భాను చందర్) వాదిస్తుంటాడు.తండ్రీకూతుళ్లకు ఎప్పుడూ ఈ విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది.అలా మూర్తి, అంజనా ఒకసారి కలవాల్సి వస్తుంది? ఆ తరువాత ఏం జరిగింది? మూర్తి జీవితంలో అంజనా తీసుకొచ్చిన మార్పులేంటి? వీరిద్దరి ప్రయాణంలో ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు మూర్తి తన కల, కోరికను తీర్చుకుంటాడా? లేదా? అన్నది కథ.
నటీనటులు
ఇంత వరకు మనం అజయ్ ఘోష్‌ని విలన్‌గా, కమెడియన్‌గా చూశాం.ఇక ఇందులో అయితే తన నటనతో ఏడ్పించేశాడు.ఓ మిడిల్ క్లాస్ మామూలు తండ్రిని చూసినట్టుగా అనిపిస్తుంది.అజయ్ ఘోష్ ఈ చిత్రంలో నవ్వించడంతో గుండెల్ని కదిలించేలా నటించేశాడు.క్లైమాక్స్‌లో కచ్చితంగా ఏడ్పించేస్తాడు.మోడ్రన్ అమ్మాయిగా, ట్రెండీ లుక్కులో చాందిని( Chandini ) కూడా ఆ పాత్రలో బాగా నటించింది.
చాలా రోజులకు మళ్లీ శుభలగ్నం, ఆ నలుగురు వంటి సినిమాల్లో దక్కినట్టుగా మంచి పాత్ర ఆమనికి దక్కింది.అమిత్ శర్మ, భాను చందర్.
దయానంద్ రెడ్డి, పటాస్ నాని ఇలా అందరూ తమ తమ పరిధి మేరకు బాగానే నటించారు.
విశ్లేషణ
ఏ సినిమాలో అయినా ఓ వ్యక్తి.తన ఫ్యామిలీ కోసమో, తన డ్రీం కోసం కష్టాలు పడుతుంటాడు.చివరకు వాటిలో సఫలం అవుతాడు.
ఇది చాలా సింపుల్ స్టోరీ.కానీ అలాంటి సింపుల్ పాయింట్‌ను ఎంచుకున్న దర్శకుడు.
రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడ్ని ఎమోషన్‌తో కట్టి పడేశాడు.ఆ విషయంలో దర్శకుడు రాసుకున్న కంటెంట్, రాసుకున్న కథ, కథనం, మాటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈ సినిమాకు యాభై ఏళ్ల వ్యక్తి కారెక్టర్‌ని మెయిన్ లీడ్‌గా పెట్టాలని అనుకోవడంలోనే సక్సెస్ అయ్యాడు.అదే ఈ సినిమాకు కొత్త పాయింట్.
ఒక 50 ఏళ్ళ వ్యక్తి, అతనికి మ్యూజిక్ పై ఉన్న ఆసక్తి, కుటుంబం కష్టాలు అంటూ మూర్తి పాత్రను బాగానే డిజైన్ చేసుకున్నాడు.ఆ పాత్రకు 20 ఏళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అంటూ DJ నేర్పించే అంజనా( Anjana ) పాత్రతో నేటి యువతను ఆకట్టుకునేందుకు మంచి ట్రాక్ ఏర్పాటు చేశాడు.ప్రారంభంలో కాస్త నిదానంగా అనిపించినా.ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగుతుంది.తండ్రీకూతుళ్ల మధ్య సాగే మాటల పోరు.మూర్తికి ఇంట్లో ఎదురయ్యే సమస్యలతో ఇంటర్వెల్‌కు కథ ఎమోషనల్‌గా మారుతుంది.
ఇక సెకండ్ హాఫ్‌లో సిటీకి వచ్చి DJ అవ్వాలని మూర్తి పడ్డ కష్టాలని, డీజే ఎలా అయ్యాడు అనే విషయాన్ని ఆసక్తిగా చూపించారు.క్లైమాక్స్ మాత్రం పూర్తి ఎమోషనల్ ఎపిసోడ్స్దతో నింపేశాడు.
సాంకేతికంగా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది.విజువల్స్ కూడా బాగున్నాయి.మ్యూజిక్ షాప్, అక్కడ బ్యాక్ గ్రౌండ్ సెటప్ అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేశారు.పాటలు ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఏడిపించేస్తుంది.
దర్శకుడిగా మొదటి సినిమాతోనే శివ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఇక నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.