పర్వత రహదారులు ఎప్పుడూ ప్రమాదకరమైనవే అని చెప్పుకోవచ్చు.కొండ చెరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా, ఎక్కడైనా సంభవించవచ్చు.
ఇలాంటి ఘటనలు ప్రాణాలను, ఆస్తిని నాశనం చేస్తాయి.ఇటీవల, తైవాన్‌లోని( Taiwan ) కీలంగ్ సిటీలో( Keelung City ) జరిగిన ఒక ల్యాండ్ స్లయిడ్ ఘటన సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో, ఒక శాంతియుత ప్రదేశంలో, పర్వతం భూమి ఒక్కసారిగా కుప్పకూలి, అల్లకల్లోలం మొదలవుతుంది.
ఒక కారు ఆగిపోయి, ఆపై వెనక్కి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.కానీ ల్యాండ్ స్లయిడ్( Landslide ) మరింత తీవ్రంగా మారడంతో, రోడ్డు పూర్తిగా మూసుకుపోతుంది.
చెట్లు నేలపై పడిపోతాయి.ఈ సమయంలో, తెల్లటి టోపీ ధరించిన ఒక మహిళ ఈ ఘటనను వీడియో తీస్తోంది.
కానీ పరిస్థితి మరింత దిగజారి పోవడంతో, ఆమె ప్రమాదాన్ని గ్రహించి, వీడియో తీస్తూనే పారిపోతుంది.
ఈ ఘోర సంఘటన వల్ల, చుట్టూ ఉన్న అనేక వాహనాలు పూర్తిగా నాశనమయ్యాయి.“కీలంగ్‌లోని న్యూ నార్త్ ఫైర్ రోడ్డుపై( New North Fire Road ) భయంకరమైన ల్యాండ్ స్లయిడ్” అనే టైటిల్‌తో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇప్పటి వరకు 27 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.వేలాది మంది దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు.
వ్యూయర్స్ కామెంట్లలో తమ ఆందోళనను, షాక్‌ను వ్యక్తం చేశారు.
ఘటనకు ముందు ఆ రోడ్డుపై ప్రయాణించానని, తృటిలో తప్పించుకున్నానని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.ఆరు రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షం తర్వాత ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు.వీడియో తీస్తున్న మహిళ తన భద్రత కంటే వీడియో తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారా అని మరొక కామెంట్‌లో ప్రశ్నించారు.
కొందరు కింద నుంచి ఈ దృశ్యాన్ని ఫొటో తీస్తున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
అభివృద్ధి, ప్రకృతి విపత్తుల మధ్య సమతుల్యత గురించి ప్రశ్నించారు.
కొండల తవ్వకాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.ఈ వీడియో చూస్తుంటే ప్రకృతి శక్తి ముందు మానవులు ఎంత అనిపిస్తుంది.
ప్రమాద సమయాల్లో వీడియోలు తీయాలనే పిచ్చి కోరిక ఎంత ప్రమాదకరమో కూడా ఇది తెలియజేస్తుంది.