రష్మిక డిమాండ్ మామూలుగా లేదు.. భారీగా పెంచిన రెమ్యూనరేషన్?

ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది.ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవడంతో ఈమెకు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఏర్పడటమే కాకుండా ఇతర భాషలలో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి.

 Rashmikasdemand Is Not Normal Increased Remuneration , Rashmika Mandanna , Tolly-TeluguStop.com

ఇకపోతే అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా ఈమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి.ఈ సినిమాతో ఏకంగా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంది.

ప్రస్తుతం ఈమె వరసగా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు.కేవలం తెలుగు తమిళ కన్నడ భాషలలోనే కాకుండా హిందీ సినిమాలతో కూడా బిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలుగు సినిమాలకు ఒక్కో సినిమాకు మూడు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

Telugu Allu Arjun, Chalo, Pushpa, Rashmika, Sukumar, Tollywood-Movie

ఈ విధంగా ఒక్కో సినిమాకు నాలుగ కోట్ల రూపాయల డిమాండ్ చేసిన నిర్మాతలు మాత్రం ఈమె అడిగిన దానికి సై అంటున్నారు.ఇలా ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఈమె కన్నా ఇండస్ట్రీలో ముందు వచ్చిన హీరోయిన్లు కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు అయితే రష్మిక మాత్రం అతి తక్కువ సమయంలోనే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం చూస్తుంటే ఈమె క్రేజ్ మామూలుగా లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం మూడు బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో వారసుడు అనే సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్ తో బిజీగా కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube