నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి( Kalki ).సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కల్కి 2898 AD పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ), దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో రానా కూడా కనిపిస్తున్నాడు.
దీంతో రానాకి, ఈ సినిమాకి సంబంధం ఏంటని? అందరిలో సందేహం మొదలైంది.
రానా( Rana Daggubati ) కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాగా కల్కి టైటిల్ గ్లింప్స్ ని అమెరికాలోని కామిక్ కాన్ వంటి ప్రెస్టీజియస్ స్టేజి పై రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఇక అక్కడ విషయాలు అన్నిటిని రానా దగ్గరుండి చూసుకున్నాడు.
ఇంతకీ రానాకి, కల్కికి ఉన్న సంబంధం ఏంటని రీసెంట్ గా జరిగిన ఒక మూవీ ప్రెస్ మీట్ లో రానాని విలేకర్లు ప్రశ్నించారు.దీనికి రానా స్పందిస్తూ చాలానే సంబంధం ఉంది.
టాలీవుడ్ లోని ఏ సినిమా అయినా బౌండరీ దాటి బయటకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ముందు నేను ఉంటాను.వాళ్ళకి కావాల్సిన సహాయం నేను చేస్తాను అని చెప్పుకొచ్చారు రానా.
ప్రస్తుతం రానా ( Rana Daggubati )చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.రానా మాటలు చూస్తుంటే ప్రభాస్ కల్కి సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే భాద్యతలు తానే తీసుకున్నట్లు తెలుస్తోంది.కల్కి సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది.కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.ఇకపోతే రానా విషయానికి వస్తే రానా చివరిగా గార్గి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.