ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ద గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది రమ్యకృష్ణ. ఇప్పటికే తన కెరియర్లో ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే పాత్రలను ఎన్నో చేసిందనే చెప్పాలి.
పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది రమ్యకృష్ట.ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి మరోసారి ప్రేక్షకులందరినీ కూడా మెప్పించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.మరి రమ్య కృష్ణ కెరీర్లో ఇప్పటివరకు మంచి పేరునే తెచ్చిపెట్టిన సినిమాలేంటో ఎప్పుడు కలుసుకుందాం.
సూత్రధారులు :
కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూత్రధారులు సినిమాలో రమ్య కృష్ణ తన నటనతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
అల్లుడుగారు :
1994 సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది.
నరసింహ :
రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో.ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన విలన్ పాత్ర కూడా అంతే సూపర్హిట్ అయింది అని చెప్పాలి.

అల్లరి మొగుడు :
మోహన్ బాబు హీరోగా రమ్యకృష్ణ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి మొగుడు సినిమా కూడా మంచి విజయం సాధించింది అని చెప్పాలి.

హలో బ్రదర్ :
నాగార్జున కెరీర్ లో మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా హలో బ్రదర్ సినిమాలో రమ్య కృష్ణ సౌందర్య హీరోయిన్ గా నటించారు.ఇక ఈ సినిమా సౌందర్య కెరియర్ను మార్చేసింది.

ఘరానా బుల్లోడు :
మరోసారి అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన రమ్య కృష్ణ ఘరానా బుల్లోడు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అమ్మోరు :
ఇక రమ్య కృష్ణ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా అమ్మోరు.ఈ సినిమా లో అమ్మవారి పాత్రలో నటించిన రమ్య కృష్ణ తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.ఇక ఆ తర్వాత సోగ్గాడి పెళ్ళాం అనే సినిమాలో మోహన్ బాబు సరసన నటించి ఆకట్టుకుంది.శ్రీకాంత్ సరసన ఆహ్వానం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది రమ్యకృష్ణ.
బాహుబలి :
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి ఆ పాత్రలో తాను తప్ప ఇంకా ఎవరు నటించలేరు ఏమో అనేంతగా తన అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించింది.ఇక మొన్నటికి మొన్న లైగర్ సినిమాలో కూడా నటించి తెలంగాణ యాసలో అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే.