మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం లో చిన్నారి పాపగా కనిపించిన ఎస్తర్ అనిల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడుతున్నట్లు చర్చ జరుగుతోంది.మలయాళం తో పాటు తెలుగు లో కూడా దృశ్యం 1 మరియు 2 సినిమాల్లో కూడా కనిపించి మెప్పించిన ఎస్తర్ అనిల్ మూడవ పార్ట్ లో ఉందా లేదా అనే విషయమై క్లారిటీ లేదు.
మరో వైపు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.వరుసగా సోషల్ మీడియా ద్వారా తన ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ మాదిరిగా స్కిన్ షో చేస్తూ ఈమె చేస్తున్న అందాల ఆరబోత ఫోటో షూట్స్ రెగ్యులర్ గా సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి.అందుకే ఈమె కు తెలుగు సినిమా పరిశ్రమ నుండి అవకాశం వచ్చిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక యంగ్ స్టార్ హీరో సరసన ఈమె హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుందని, ఆయన ఇటీవల ఒక కొత్త దర్శకునికి ఓకే చెప్పాడట.ఆ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుంది.ఆ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది.ఆ సినిమాలో హీరోయిన్ గా ఈమె ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని 25 లక్షల రూపాయల పారితోషికం ఒప్పందం కూడా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ఇప్పటికే వరుసగా సినిమా లు చేస్తున్న ఆ యంగ్ హీరో సక్సెస్ అవ్వక కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.ఈ సమయంలోనే ఈమెను హీరోయిన్ గా తన సినిమాలో పెట్టుకోవడం అనేది కచ్చితంగా ప్రయోగం అవుతుంది అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.
దాంతో మరో సారి ఆలోచించాలని హీరో మరియు దర్శకుడు ప్రస్తుతం ఆమె విషయంలో ఆలోచనలో ఉన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ తెలుగులో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మంచి సక్సెస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







