సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసింది.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు త్రివిక్రమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మహేష్ బాబు ఈ సినిమా లో చాలా కొత్తగా విభిన్నంగా కనిపించబోతున్నాడని కాస్త రఫ్ లుక్ గడ్డం తో త్రివిక్రమ్ కనిపిస్తాడని ఇప్పటికే విడుదలైన స్టిల్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది.ఇక ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ అంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.
సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం లో కూడా ఆమె పాల్గొన్నది.దాంతో మహేష్ బాబు యొక్క అభిమానులు చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు.
మహేష్ బాబు మరియు పూజా హెగ్డే గతం లోనే మహర్షి సినిమా లో నటించారు.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అరవింద సమేత మరియు అల వైకుంటపురం లో సినిమా ల్లో ఆమె నటించింది.ఇప్పటికే పూజా హెగ్డే ని చాలా సినిమా ల్లో చూశారు తెలుగు ప్రేక్షకులు.ఇంకా కూడా ఆమె ను ఆదరించాలని కోరు కోవడం లేదు.
ఈ సమయం లో ఆమెను మహేష్ బాబు కు జోడి గా చూడాలనుకోవడం లేదంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సీతారామం హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని ఈ సినిమా కోసం తీసుకోవాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.
కానీ ఇప్పటికే త్రివిక్రమ్ పూజ హెగ్డే ని కన్ఫర్మ్ చేశాడు.తాజాగా పూజా హెగ్డే ను ఈ సినిమా నుండి తీసి వేశారు అంటూ వస్తున్న వార్తలు కూడా నిజం కాదని పూజా హెగ్డే ఇప్పటికే అడ్వాన్స్ తీసుకోవడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో కూడా నటించింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే మహేష్ బాబు మరియు పూజా హెగ్డే ల కాంబినేషన్లో సన్నివేశాలు చిత్రీకరణకు త్రివిక్రమ్ ఏర్పాట్లు చేస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.