ఈనాడు గ్రూప్స్ సంస్థ అధినేత, పద్మ విభూషణ్ రామోజీరావు( Padma Vibhushan Ramoji Rao ) మృతికి మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు( Dr.Jupalli Rameswara Rao ) సంతాపం తెలిపారు.జర్నలిజంలో రామోజీరావు ఒక ట్రెండ్ సెట్ చేశారని పేర్కొన్నారు.నూతన ఒరవడులు, పోకడలతో నిత్య నూతనంగా మీడియా రంగంలో వెలుగొందిన రామోజీరావు జీవితం ధన్యమని రామేశ్వర రావు తెలిపారు.
లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన రామోజీరావు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.కాగా రామోజీరావు కన్నుమూయడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.