RAM Movie Review : రామ్ (RAM Rapid Action Mission) మూవీ రివ్యూ.. దేశ భక్తిని చాటే చిత్రం!

సూర్య‌, ధ‌న్యాబాల‌కృష్ణ‌( Dhanya Balakrishna ), సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ రామ్( RAM )తాజాగా నేడు అనగా శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా రూపొందిన ఈ సినిమాకు మిహిరాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 Ram Movie Review : రామ్ (ram Rapid Action Mission) మూవీ రి-TeluguStop.com

మరి ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.

కథ :

Telugu Bhanu Chander, Ram, Ram Review, Ram Rapid, Sai Kumar, Surya, Tollywood-Mo

మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు లెక్కచేయకుండా దేశం కోసం వీర మరణం పొందుతాడు.తమ కోసం మరణించాడంటూ మరో మేజర్ జేబీ (భాను చందర్) ఆ విషయాన్నీ ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు.మేజర్ సూర్య ప్రకాష్ కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల) మాత్రం దేశానికి సేవ చేయడం అంటే ఇష్టం ఉండదు.

దేశానికి సేవ చేస్తూ తన తండ్రి చనిపోతే కుటుంబం దిక్కులేని వాళ్లం అయ్యామని, చిన్నతనంలోనూ నాన్న తనతో ప్రేమగా ఉండలేకపోయాడంటూ కోపంతో ఉంటాడు రామ్.అలాంటి రామ్‌ను సూర్య ప్రకాష్ కోరిక మేరిక డిపార్ట్మెంట్‌లోకి జాయిన్ చేయించడానికి జేబీ చేసిన ప్రయత్నాలు ఏంటి? జేబీ కూతురు జాహ్నవి (ధన్య బాలకృష్ణ)కు ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఏంటి? ఉగ్ర సంస్థల కుట్రను చివరకు రామ్ అడ్డుకున్నాడా? దేశభక్తి అంటే ఇష్టం లేని రామ్.చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిగా ఎలా మారాడు? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

Telugu Bhanu Chander, Ram, Ram Review, Ram Rapid, Sai Kumar, Surya, Tollywood-Mo

ఇందులో రామ్ పాత్రలో సూర్య( Surya ) అద్భుతంగా నటించాడు.తన నటనతో దేశ భక్తితో ఎదిగిన ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు చూపించే వ్యత్యాసం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కాస్త అల్లరి చిల్లరగా, పిచ్చి జుట్టు వేసుకున్నట్టుగా అమ్మాయి ప్రేమ కోసం తిరిగే ఒక సాధారణ కుర్రాడిలా కనిపిస్తాడు.

సెకండ్ ఆఫ్ ల్ప్ మాత్రం దేశం కోసం ప్రాణాలిచ్చే సిన్సియర్ ఆఫీసర్‌ గా సీరియస్ నటించి అలరించారు.యాక్షన్ ఎమోషన్ కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ సూర్య ఆకట్టుకున్నాడు.

రోహిత్ చాలా రోజులకు మంచి పాత్రలో కనిపించాడు.ఈ చిత్రానికి కనిపించిన రియల్ హీరోలా మారాడు.

భానుచందర్ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు.సాయి కుమార్, శుభలేక సుధాకర్ తమ అనుభవాన్ని చూపించారు.

సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీతో మరోసారి ఆడియెన్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు.హీరోయిన్ ధన్యా బాలకృష్ణ లుక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ :

Telugu Bhanu Chander, Ram, Ram Review, Ram Rapid, Sai Kumar, Surya, Tollywood-Mo

రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న కోర్ పాయింట్ పాతదే అయినప్పటికీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం మాత్రం కొత్తగా ఉంటుంది.ప్రతీ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది.ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి.బార్డర్ లోపల, సీక్రెట్ స్లీపర్స్ అంటూ ఇలా ఎన్నో కాన్సెప్టుల మీద సినిమాలు వచ్చాయి.కానీ బ్యూరో క్రాటిక్ జిహాద్ అనే కొత్త పాయింట్‌ను టచ్ చేశాడు.ఫస్ట్ హాఫ్‌కు సంబంధించి కొన్ని సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి.

కొన్ని చోట్ల రామ్, ఫ్రెండ్ కారెక్టర్ చేసిన భాష నవ్వులు పూయిస్తారు.సెకండాఫ్ పూర్తి సీరియస్ మోడ్‌లో దేశ భక్తి కోణంలో నడిపించాడు.

మిహిరాం క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు.ప్రతీ ఒక్క భారతీయుడికి ఈ సీన్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.త్రివర్ణ పతాకం కనిపించే షాట్, దేశ భక్తిని, మత సామరస్యాన్ని చాటేలా చివర్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేలా చూపించే షాట్ హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సాయం చేసే సీన్‌కు దండం పెట్టాల్సిందే.

టెక్నికల్

:

Telugu Bhanu Chander, Ram, Ram Review, Ram Rapid, Sai Kumar, Surya, Tollywood-Mo

రామ్ సినిమాలో టెక్నికల్ టీం కొండంత అండగా నిలబడింది.ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయింది.ధారన్ సుక్రి విజువల్స్, ఆయన టాలెంట్ చెప్పాలంటే క్లైమాక్స్ షాట్స్ చాలు.

అద్భుతమైన కెమెరా వర్క్ కనిపిస్తుంది.మాటలు గుండెల్ని హత్తుకుంటాయి.

హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి.ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి.

నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది.నిర్మాత కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలా ఉంది.

బాటమ్ లైన్

:

రామ్ దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ మూవీ.ఎలాంటి అంచ‌నాలు పెట్టుకోకుండా చూస్తే కొంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది.

రేటింగ్ : 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube