ఫిన్లాండ్ మంచు కొండల్లో తేలిన చరణ్ జంట.. వెకేషన్ పిక్స్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని దాదాపు రెండేళ్ల తర్వాత వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.కరోనా వచ్చినప్పటి నుండి వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్ళలేదు.

 Ram Charan And Upasana Go On A Vacation After 2 Years , Ram Charan , Upasana , V-TeluguStop.com

ఇక ఇప్పుడు ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సెలెబ్రిటీ కపుల్ విహారయాత్ర కు వెళ్లారు.చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుండడంతో ఉపాసన చాలా హ్యాపీ గా కనిపిస్తుంది.

Telugu Celebrity, Finland, Kiara Advani, Quality Time, Ram Charan, Rc, Shankar,

వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్ తన భార్య కోసం కొద్దిగా సమయం కేటాయించి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి వెకేషన్ కు వెళ్ళాడు.వీరు వెకేషన్ లో దిగిన ఫోటోలను ఎప్పటి కప్పుడు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువలో ఉంటున్నారు.తాజాగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన కలిసి ఫిన్లాండ్ కు వెకేషన్ కు వెళ్లారు.అక్కడ మంచు పర్వతాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Telugu Celebrity, Finland, Kiara Advani, Quality Time, Ram Charan, Rc, Shankar,

ఈ ఫొటోల్లో చరణ్ కొత్త లుక్ లో కనిపించి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేసాడు.ప్రెసెంట్ చరణ్ చేస్తున్న ఆర్సీ 15 సినిమా కారణంగానే ఆయన తన లుక్ మార్చేశాడు అని అభిమానులు భావిస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దిల్ రాజు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Celebrity, Finland, Kiara Advani, Quality Time, Ram Charan, Rc, Shankar,

ఇక చరణ్ తేజ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25, 2022 న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా తో చరణ్ రేంజ్ మారిపోబోతుంది.

పాన్ ఇండియా స్టార్ గా రెట్టింపు ఇమేజ్ సొంతం చేసుకోవడం ఖాయం.దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి తో పాటు చేసిన ఆచార్య సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వ కుండానే శంకర్ సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ కూడా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube