Rajinikanth, Kamal Haasan : ఏ రోజుకైనా కమల్ హాసన్ అంతటి స్టార్ కావాలని కలలు కన్న రజినీకాంత్ … అసలెంటి ఈ కథ ?

రజినీకాంత్, కమల్ హాసన్( Rajinikanth, Kamal Haasan ) ఇద్దరూ కూడా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇద్దరి దోరణి, అలాగే సినిమాలు ఎంచుకునే పద్ధతి ఎవరికి వారిదే భిన్నంగా ఉంటుంది.

 Rajinjkanth Dreamt About Star Dom Of Kamal Haasan-TeluguStop.com

ఇప్పటికీ ఇంత వయసు వచ్చిన ఇద్దరు హీరోలుగా సినిమాలు చేయగలుగుతున్నారు అంటే అది వారి అభిమానులు పెట్టుకున్నా అభిమానమే అని చెప్పక తప్పదు.అయితే కమల్ హాసన్ రజినీ కాంత్ కన్నా కాస్త సీనియర్.

రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి కమల్ ఒక స్టార్ సెలబ్రెటీ గా తమిళ ఇండస్ట్రీని ఏలుతున్నారు.ఇక శ్రీదేవి( Sridevi ) రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి ముగ్గురు ఒక చిత్రంలో నటించిన సందర్భంగా ఒక సంఘటన జరిగింది.

అది శ్రీదేవి బతికున్నప్పుడు ఒక మీడియా ఛానల్ తో పంచుకోగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Kamal Haasan, Mundru Mudicu, Rajinikanth, Sridevi, Tamil Nadu-Telugu Top

అది శ్రీదేవి మరియు కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా.దాని పేరు మూండ్రు ముడిచు( mundru mudicu ).ఈ సినిమాలో నటించే సమయానికి కమల్ హాసన్ స్టార్ హీరోగా ఉన్నారు.ఆయన ఒక్కో సినిమాకి 30 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.చూడ్డానికి ఎంతో అందంగా,తెల్లగా, క్లాసిక్ గా ఉండే కమల్ హాసన్ అందరికీ అప్పట్లో ఫేవరెట్ హీరో గానే ఉండేవారు.

అందరికి కమల్ హాసన్ అంతటి స్టార్ అవ్వాలని కోరుకునే వారు.అయితే అలా కోరుకున్న వారిలో రజనీకాంత్ కూడా ఒకడు.చూడ్డానికి నల్లగా హీరో లక్షణాలు లేనటువంటి రజనీకాంత్ కమల్ ని చూసి అంతటి హీరో అవ్వాలని అనుకునే వాడట.

Telugu Kamal Haasan, Mundru Mudicu, Rajinikanth, Sridevi, Tamil Nadu-Telugu Top

అంతేకాదు ఆ టైంలో రజనీకాంత్, శ్రీదేవి కేవలం 2000 రూపాయల కోసం పని చేశారు.1976లో విడుదలైన ఈ చిత్రానికి పారితోషకాల విషయంలో చూస్తే కమలహాసన్ మాత్రమే 30,000 తీసుకున్నారు మిగతా అందరికీ 2000 లోపే ఉండేది.అలా అంతటి స్థాయి అందుకోవాలని కలలు కన్నా రజనీకాంత్ ఈరోజు తమిళనాడు మాత్రమే కాదు భారతదేశం మొత్తం గర్వించే స్థాయిలో ఉన్నారు.

అయితే కమల్ కూడా అదే స్థాయిలో ఉన్నప్పటికీ రజినీకాంత్ తో పోలిస్తే కాస్త కమర్షియల్ హంగులు పరంగా తక్కువనే అనుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube