సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilipkumar ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్”.ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సంచలన విజయంగా నిలిచింది.
ఈ వయసులో కూడా జైలర్ లాంటి సినిమాతో అదర గొట్టాడు.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా ఇంకా థియేటర్స్ లో రన్ కొనసాగుతూనే ఉంది.
గత దశాబ్దంలో రజినీకాంత్ ఈ రేంజ్ హిట్ అందుకోలేదనే చెప్పాలి.వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న రజనీకాంత్ కు ఈ హిట్ ఊపిరి పోసింది.కమర్షియల్ గానే కాకుండా కలెక్షన్స్ కూడా అదరగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పటి వరకు ఈ సినిమా 525 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ హిట్ అందుకుంది.
ఈ సినిమా నిర్మాతలకు జేబులు నింపింది.
ఇక జైలర్( Jailer Movie ) రికార్డుల పరంగా కూడా రాణిస్తుంది.జైలర్ తో రజనీకాంత్ ఉన్న రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డులను సైతం నెలకొల్పుతుంది.మరి తాజాగా జైలర్ సినిమా మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
జైలర్ మూవీ సౌత్ లోని నాలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ తొలి సినిమాగా చరిత్రకెక్కింది.తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ 50 కోట్ల మార్క్ దాటేసింది.
ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఇన్ని రాష్ట్రాల్లో 50 కోట్లను కలెక్ట్ చేయలేదు. కెజిఎఫ్ 2, బాహుబలి 2 ( Baahubali 2 )సీక్వెల్స్ మాత్రమే కలెక్ట్ చేసాయి.
మొత్తానికి తలైవా ఖాతాలో మరో రికార్డ్ నెలకొనింది.దీంతో ఫ్యాన్స్ తెగ ఆనందంగా ఉన్నారు.