Rajamouli Vs Prashanth Neel : ఆ విషయం లో రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ బెస్ట్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులలో రాజమౌళి( Rajamouli ) ఒకడు.అయితే ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ తనదైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Rajamouli Vs Prashanth Neel : ఆ విషయం లో రాజమౌళి-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో రాజమౌళి తో పాటు గా సౌత్ నుంచి చాలామంది దర్శకులు వాళ్ళ సత్తా ఏంటో చూపించుకొని పాన్ ఇండియా దర్శకులుగా ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ కూడా కేజిఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాజమౌళికి ప్రశాంత్ నీల్ కి మధ్య పోటీ పెడుతూ చాలామంది కంపేర్ చేస్తున్నారు.

 Rajamouli Vs Prashanth Neel : ఆ విషయం లో రాజమౌళి-TeluguStop.com

అయితే రాజమౌళి తీసినంత స్టాండర్డ్ గా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమాలను తీయలేడు.రాజమౌళి ఎమోషన్ ని బిల్డ్ చేసినట్టుగా ప్రశాంత్ నీల్ ఎమోషన్ ని బిల్డ్ చేయలేడు, కానీ రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ తొందరగా సినిమాలు చేసి భారీ సక్సెస్ లను రాబడతాడు అనే ఒక మంచి పేరు అయితే ప్రశాంత్ నీల్ కి ఉంది.రాజమౌళి సినిమా రావాలంటే దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైమ్ పడుతుంది.

అన్ని సంవత్సరాలు ఆయన సినిమా కోసం హీరోల అభిమానులు ఎదురు చూస్తూ ఉండాలి.సక్సెస్ మాత్రం చాలా సాలిడ్ గా ఉంటుంది.

ఇక ప్రశాంత్ నీల్ అయితే చాలా తక్కువ రోజుల్లోనే సూపర్ హిట్ సినిమాలు తీస్తారనే పేరు అయితే సంపాదించుకున్నాడు.ఈ ఒక్క విషయంలో తప్ప ప్రశాంత్ నీల్ రాజమౌళి తో ఈ విషయం లోనూ పోటీ కాదు అంటూ చాలామంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న పాటి గురించి మాట్లాడుతున్నారు.అయితే రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా( Pan World ) చేస్తున్నాడు.కాబట్టి ప్రస్తుతం ఆయనకి పోటీ ఇచ్చే డైరెక్టర్ ఇండియా లో లేడనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube