ఆ దర్శకుడిపై మండి పడుతున్న రాజమౌళి అభిమానులు

తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన దర్శకుడు రాజమౌళి.( Director Rajamouli ) ప్రస్తుతం ఇండియన్ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటే అది కేవలం రాజమౌళి వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Rajamouli Fans Angry On Director Teja Details, Director Teja, Mahesh Babu, Rajam-TeluguStop.com

ఆస్కార్‌ నామినేషన్స్ దక్కడమే గగనం అనుకుంటూ ఉన్న సమయంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు( Naatu Naatu Song ) ఆస్కార్‌ అవార్డును అందుకున్నాడు.అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డును కూడా జక్కన్న టీమ్ అందుకుంది అంటే ఏ స్థాయిలో సినిమా సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి గొప్ప దర్శకుడిని విమర్శించి కొందరు పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు చేయడం దారుణం.

Telugu Teja, Jr Ntr, Mahesh Babu, Natu Natu, Oscar Award, Rajamouli, Ram Charan,

రాజమౌళి పేరు చెబితే మీడియాలో ఫోకస్ అవ్వచ్చు అని కొందరు భావిస్తూ ఉంటారు.అందుకే రాజమౌళి పై విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు.ఆ విషయం పక్కన పెడితే తాజాగా ప్రముఖ దర్శకుడు తేజ( Director Teja ) ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చిన్నబుచ్చుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

రాజమౌళికి అంత సీన్‌ లేదు అంటూ ఆయన చేసిన విమర్శల పై చాలా మంది సీరియస్ అవుతున్నారు.తేజ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

రాజమౌళి పై కొందరు చేస్తున్న విమర్శలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Teja, Jr Ntr, Mahesh Babu, Natu Natu, Oscar Award, Rajamouli, Ram Charan,

నెట్టింట ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది.రాజమౌళి కి మరియు ఆయన అభిమానులకు కచ్చితంగా దర్శకుడు తేజ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు.రాజమౌళి ని గురించి ఎవరు విమర్శించినా కూడా దేశాన్ని అవమానించినట్లే అంటూ కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాజమౌళి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా ఒక సినిమా ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube