అషురెడ్డి గురించి చెబుతూ రాహుల్ ఎమోషనల్.. రూపాయి కూడా తీసుకోలేదంటూ?

టిక్ టాక్ వీడియోల ద్వారా అషురెడ్డి, సినిమాల్లో పాటలు పాడటం ద్వారా రాహుల్ సిప్లిగంజ్ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో వల్ల అటు రాహుల్ సిప్లిగంజ్ కు ఇటు అషురెడ్డికి పాపులారిటీ మరింత పెరిగింది.

 Rashul Sipligunj About Ashureddy On Nuvvevvare Song Update, Ashureddy, Interesti-TeluguStop.com

తాజాగా రాహుల్ సిప్లిగంజ్ అషురెడ్డి గురించి ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అయితే రాహుల్ అషురెడ్డి మధ్య రిలేషన్ షిప్ గురించి గతంలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

ఒక నెటిజన్ కు రాహుల్ సమాధానం ఇస్తూ నాకు, అషురెడ్డికి మధ్య ఉన్న రిలేషన్ ఫ్రెండ్ షిప్ అని మొత్తానికి నువ్వైనా గుర్తు పట్టావని చెప్పుకొచ్చారు.తనతో ఆల్బమ్ ను చేయించడానికి అషు మూడు రోజులు ఉందని అషు ఈ ఆల్బమ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.

నువ్వెవరో సాంగ్ కొరకు అషురెడ్డి చేసిన సాయం నిజమైన సాయమని రాహుల్ సిప్లిగంజ్ వెల్లడించారు.

ఒక స్నేహితుడిని అషురెడ్డి అంతలా సపోర్ట్ చేస్తుందని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.

Telugu Ashu, Friendship, Nuvvevvare, Rahul Sipligunj, Rahulsipligunj, Tollywood-

రాహుల్ చేసిన కామెంట్ల గురించి అషురెడ్డి స్పందిస్తూ లవ్ యూ రాహుల్ అని సమాధానం ఇచ్చారు.రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఇప్పటికే భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ప్రైవేట్ ఆల్బమ్స్ వల్ల కొన్నిసార్లు నష్టాలు వచ్చినా రాహుల్ సిప్లిగంజ్ మాత్రం వెనక్కు తగ్గలేదు.

Telugu Ashu, Friendship, Nuvvevvare, Rahul Sipligunj, Rahulsipligunj, Tollywood-

ఈ జోడీపై గతంలో చాలా రూమర్లు రాగా ఈ జోడీ మాత్రం తాము మంచి ఫ్రెండ్స్ అని అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.అషురెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ కలిసి చాలా పార్టీలు చేసుకోగా ఆ పార్టీల వల్లే వీళ్లిద్దరూ క్లోజ్ కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube