సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించేటప్పుడు చిత్రబృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆ సినిమా విషయాలు బయటకు లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు ఆకతాయిలు మాత్రం సినిమాకు సంబంధించిన విషయాలను లీక్ చేస్తూనే ఉంటారు.
ఈ లీకుల విషయంపై ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా భారీ బడ్జెట్ చిత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయి.తాజాగా సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న టువంటి “పుష్ప” సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమాలోని మొదటి పాటను నేడు ( ఆగస్టు 13న) విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.అయితే ముందు రోజే ఈ పాట లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక, పులొచ్చి కోరుకుద్ధి పీక” అనే ఈ పాటను ఐదు భాషలలో, ఐదు మంది సింగర్ ల చేత ఒకేసారి పాడించారు.ఈక్రమంలోనే తెలుగులో పాడినటువంటి పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే లీకయిన ఈ పాట ఒరిజినల్ పాట కాదని తెలుస్తుంది.
ఒరిజినల్ పాటను సింగర్ శివమ్ పాడారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పాటలో మాత్రం మనకు దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ వినిపిస్తుంది.అంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పాట ఒరిజినల్ పాట కాదని అర్థమవుతుంది.
దేవి శ్రీ ప్రసాద్ తన సినిమాలన్నింటిలో కూడా ముందుగా టెస్టింగ్ కోసం తను పాటలు పాడి ఆ తరువాత సింగర్ ల చేత పాడిస్తాడు.అయితే ప్రస్తుతం దేవిశ్రీ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ పాటను విన్న నెటిజన్లు కేవలం ప్రమోషన్ కోసమే ఈ పాటను లీక్ చేసి ఉంటారని పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.అయితే విడుదల చేయబోయే ఒరిజినల్ పాట ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.