పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణహత్య నుంచి దేశం ఇంకా తేరుకోలేదు.ఎంతో మంచి భవిష్యత్తు వున్న ఈ యువ ర్యాపర్ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంపై పలువురు కంటతడి పెడుతున్నారు.
ఆయన హత్యతో పంజాబ్‌లో పెరుగుతున్న గన్ కల్చర్, గ్యాంగ్ వార్, రౌడీ రాజకీయాలు, ఖలిస్తాన్ ఉగ్రవాదంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.దీనిని ఇలాగే చూస్తూ ఊరుకుంటే 80వ దశకం నాటి చీకటి రోజులు మళ్లీ పంజాబ్‌లో ఏర్పడే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే.సిద్ధూ మూసేవాలా భారత్, అమెరికా, కెనడాలలో వరుస ప్రదర్శనలు ఇవ్వాల్సి వుంది.ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగానే ఈ దారుణం జరిగింది.జూలై 23న కెనడాలోని వాంకోవర్, 24న విన్నిపెగ్, 30న టొరంటో, 31న కాల్గరీలో సిద్ధూ ప్రదర్శనలు ఇవ్వాల్సి వుంది.
అలాగే ఆగస్టు 5న అమెరికాలోని న్యూయార్క్, 6న చికాగో, 12న ఫ్రెస్నో, 13న బే ఏరియాలో మూసేవాలా ప్రదర్శన ఇవ్వాల్సి వుంది.
దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు సిద్ధూ.తాము త్వరలో కెనడా, యూఎస్ వస్తున్నామనే స్టేటస్ పెట్టాడు.అంతేకాదు టూర్ కోసం టీజర్ కూడా విడుదల చేశాడు.
ఈ ప్రదర్శనలకు సంబంధించి టికెట్‌లను కొనుగోలు చేయాల్సిందిగా తన అభిమానులను కోరాడు.అలాగే తన అభిమానుల కోసం సోషల్ మీడియా ఖాతాలలో డిస్కౌంట్ కూపన్‌లను సైతం అందుబాటులో వుంచాడు.
కానీ సిద్ధూ మూసేవాలా దారుణహత్యతో అతని ప్రదర్శనలు మొత్తం రద్దు చేశారు నిర్వాహకులు.ఆయనను కాల్చి చంపడానికి కొన్ని గంటల ముందు.
వాంకోవర్ ప్రదర్శనకు సంబంధించిన టికెట్ల విక్రయం భద్రతా సమస్యల కారణంగా ఆలస్యమైంది కూడా.