ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి వున్నాం : పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి

ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( Kuldeep Singh Dhaliwal ).ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం పంజాబ్‌లో స్వచ్ఛమైన, పారదర్శకమైన పరిపాలనను అందిస్తూనే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతోందన్నారు.

 Punjab Government Committed To Resolving Issues Of Nris Minister Kuldeep Singh D-TeluguStop.com

కొత్తగా ఎన్నికైన ఎన్ఆర్ఐ సభ అధ్యక్షురాలు పర్వీందర్ కౌర్( Parvinder Kaur ) బంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కుల్దీప్ సింగ్ పాల్గొన్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.

పంజాబ్ ( Punjab )ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే ఐదు ఎన్ఆర్ఐ మిల్నిస్‌ని ఏర్పాటు చేసిందన్నారు.ఇందులో ఎన్ఆర్ఐల నుంచి ఇప్పటి వరకు 610 ఆస్తి సంబంధిత ఫిర్యాదులు అందాయని, వీటిలో 595 ఫిర్యాదులను ప్రభుత్వం పరిష్కరించిందని కుల్దీప్ తెలిపారు.

కోర్టులో వ్యాజ్యాల కారణంగా కొన్ని మాత్రం పెండింగ్‌లో వున్నాయని పేర్కొన్నారు.

Telugu Jaikrishan, Kuldeepsingh, Mpsushil, Nri Community, Parvinder Kaur, Punjab

ఎన్ఆర్ఐ కమ్యూనిటీ( NRI community ) తమ సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకునేందుకు పంజాబ్‌లో తమ బసను పొడిగించాల్సిన అవసరం లేదని ధాలివాల్ అన్నారు.తక్కువ వ్యవధిలోనే వారి సమస్యలను పరిష్కరించే యంత్రాంగాన్ని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.పంజాబ్ ప్రభుత్వం త్వరలో పఠాన్ కోట్ జిల్లాలో మరో ఎన్ఆర్ఐ మిల్నీని నిర్వహించేందుకు సిద్ధంగా వుందని ధాలివాల్ తెలిపారు.

ఇందులో ఎన్ఆర్ఐలు తమ సూచనలు, అభిప్రాయాలను సమర్పించవచ్చన్నారు.

Telugu Jaikrishan, Kuldeepsingh, Mpsushil, Nri Community, Parvinder Kaur, Punjab

ఎన్ఆర్ఐ సభ అధ్యక్షురాలిగా ఎన్నికైన పర్వీందర్ కౌర్.కుల్దీప్ సింగ్ ధాలివాల్, పంజాబ్ స్పీకర్ జై క్రిషన్ సింగ్ రౌరీ, ఎంపీ సుశీల్ కుమార్ రింకూ, పంజాబ్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ రాజ్‌విందర్ కౌర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube