ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి వున్నాం : పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి
TeluguStop.com
ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( Kuldeep Singh Dhaliwal ).
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం పంజాబ్‌లో స్వచ్ఛమైన, పారదర్శకమైన పరిపాలనను అందిస్తూనే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతోందన్నారు.
కొత్తగా ఎన్నికైన ఎన్ఆర్ఐ సభ అధ్యక్షురాలు పర్వీందర్ కౌర్( Parvinder Kaur ) బంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కుల్దీప్ సింగ్ పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.పంజాబ్ ( Punjab )ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే ఐదు ఎన్ఆర్ఐ మిల్నిస్‌ని ఏర్పాటు చేసిందన్నారు.
ఇందులో ఎన్ఆర్ఐల నుంచి ఇప్పటి వరకు 610 ఆస్తి సంబంధిత ఫిర్యాదులు అందాయని, వీటిలో 595 ఫిర్యాదులను ప్రభుత్వం పరిష్కరించిందని కుల్దీప్ తెలిపారు.
కోర్టులో వ్యాజ్యాల కారణంగా కొన్ని మాత్రం పెండింగ్‌లో వున్నాయని పేర్కొన్నారు. """/" /
ఎన్ఆర్ఐ కమ్యూనిటీ( NRI Community ) తమ సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకునేందుకు పంజాబ్‌లో తమ బసను పొడిగించాల్సిన అవసరం లేదని ధాలివాల్ అన్నారు.
తక్కువ వ్యవధిలోనే వారి సమస్యలను పరిష్కరించే యంత్రాంగాన్ని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
పంజాబ్ ప్రభుత్వం త్వరలో పఠాన్ కోట్ జిల్లాలో మరో ఎన్ఆర్ఐ మిల్నీని నిర్వహించేందుకు సిద్ధంగా వుందని ధాలివాల్ తెలిపారు.
ఇందులో ఎన్ఆర్ఐలు తమ సూచనలు, అభిప్రాయాలను సమర్పించవచ్చన్నారు. """/" /
ఎన్ఆర్ఐ సభ అధ్యక్షురాలిగా ఎన్నికైన పర్వీందర్ కౌర్.
కుల్దీప్ సింగ్ ధాలివాల్, పంజాబ్ స్పీకర్ జై క్రిషన్ సింగ్ రౌరీ, ఎంపీ సుశీల్ కుమార్ రింకూ, పంజాబ్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ రాజ్‌విందర్ కౌర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
వైరల్ వీడియో: నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తున్న అద్దాల మేడ..