భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లయిన ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల ( Chhateshwar Pujara, Ajinkya Rahanela )టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టే.భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయిన సంగతి అందరికీ తెలిసిందే.
విరాట్ కోహ్లీ( Virat Kohli ) స్థానంలో పుజారా లేదా రహానే లలో ఎవరికో ఒకరికి కచ్చితంగా అవకాశం దక్కుతుందని అంతా భావించారు.కానీ బీసీసీఐ యువ ఆటగాడైన రజత్ ఫాటిదార్ కు అవకాశం ఇచ్చింది.
దీనిని బట్టి చూస్తే ఇక సీనియర్ ఆటగాలైన రహనే, పుజారాలకు టెస్ట్ క్రికెట్ ఆడే భారత జట్టులో చోటు దక్కడం కష్టమే అని స్పష్టంగా తెలుస్తోంది.

యువ ఆటగాడైన రజత్ ఫాటిదార్( Rajat Fatidar ) కు జట్టులో ఎందుకు స్థానం ఇచ్చారో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇవ్వడం జరిగింది.యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోలేదట.యువ ఆటగాళ్లకు నేరుగా విదేశాల్లో అవకాశం ఇవ్వకుండా అనువైన పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రోహిత్ శర్మ వివరించాడు.
భారత జట్టులో ఏ ఆటగాడికైనా అవకాశం దక్కాలంటే ఫిట్నెస్ కాపాడుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులో మళ్లీ పునరాగమనం చెయ్యొచ్చని రోహిత్ శర్మ సూచించాడు.

ప్రస్తుతం భారత జట్టులో ఉండే ఆటగాళ్లలో చాలామంది సీనియర్ ఆటగాళ్ల వయసు 35 ఏళ్లకు పైనే ఉంది.రోహిత్ శర్మ (36) విరాట్ కోహ్లీ (35), రవిచంద్రన్ అశ్విన్ (37), రవీంద్ర జడేజా (35).ఒకవేళ ఈ ఆటగాళ్లందరూ జట్టు నుంచి నిష్క్రమిస్తే, అప్పుడు భారత జట్టు పరిస్థితి చాలా దారుణంగా మారే అవకాశం ఉంది.
కాబట్టి ఈ ఆటగాళ్లు క్రికెట్ కు వీడ్కోలు చెప్పేలోపే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వారిని తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది.ఈ లెక్కను చూసుకుంటే టీంఇండియాలో రహానే, పుజారాలను మళ్లీ చూడడం కష్టమే.