మహేష్ బాబు భార్య నమ్రత( Namrata ) తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.నమ్రత వయస్సు ప్రస్తుతం 52 సంవత్సరాలు కాగా ఫోటోలలో మాత్రం ఆమె చాలా యంగ్ గా కనిపిస్తారు.వయస్సులో మహేష్ బాబుతో( Mahesh Babu ) పోల్చి చూస్తే నమ్రత ఐదేళ్లు పెద్ద అనే సంగతి తెలిసిందే.1993 సంవత్సరంలో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రతకు సోషల్ మీడియాలో సైతం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ నెల 22వ తేదీన నమ్రత పుట్టినరోజు( Namrata Birthday ) వేడుకలు గ్రాండ్ గా జరగగా ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.అయితే నమ్రత బర్త్ డే పార్టీలో బాలయ్య పెద్ద కూతురు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి( Nara Brahmani ) పాల్గొని సందడి చేశారు.
నమ్రత బర్త్ డే ఫోటోలలో బ్రాహ్మణి హైలెట్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఒకే ఫ్రేమ్ లో నమ్రత, నారా బ్రాహ్మణిలను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వీళ్లిద్దరి మధ్య స్నేహం ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు నమ్రత రీఎంట్రీ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా నమ్రత మాత్రం సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చే ఆలోచన అయితే లేదని చెబుతున్నారు.మహేష్, నమ్రత కాంబినేషన్ లో తెరకెక్కిన వంశీ మూవీ( Vamsi Movie ) తెరకెక్కగా ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.నమ్రత గౌతమ్, సితార కెరీర్ పై ప్రస్తుతం దృష్టి పెట్టారు,

గౌతమ్, సితారలకు కూడా సినిమాలపై ఆసక్తి ఉందని సరైన ప్రాజెక్ట్ లతో సమయం వచ్చినప్పుడు సినిమాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇస్తారని సమాచారం అందుతోంది.చిన్న వయస్సులోనే గౌతమ్, సితార తమ టాలెంట్ తో అభిమానులకు దగ్గరవుతున్నారు.సితార డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మహేష్ ప్రస్తుతం భవిష్యత్తు ప్రాజెక్ట్ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు.