నల్లమల్ల దారి దోపిడీ కేసులో పురోగతి

నల్లమల్ల దారి దోపిడీ కేసులో పురోగతి లభించింది.ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.

 Progress In Nallamalla Road Robbery Case-TeluguStop.com

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలో చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన నంద్యాల, ప్రకాశం జిల్లాల పోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు.అనంతరం వారి వద్ద నుంచి బంగారం, నగదును రికవరీ చేశారు.

దోపిడీ తర్వాత మహానందికి వెళ్లిన నిందితులు యాత్రికుల్లా రిలాక్స్ అయ్యారని పోలీసులు వెల్లడించారు.రహదారిపై కారును అడ్డుకున్న నిందితులు బంగారం వ్యాపారులను బెదిరించి 700 గ్రాముల బంగారం, రూ.7 లక్షల నగదును అపహరించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube