బాలకృష్ణ పై అంత ఖర్చు పెట్టడం సబబేనా.. మైత్రి వారి పరిస్థితి ఏంటీ?

నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను గోపీచంద్ మలినేని దర్శకత్వం లో దాదాపు 160 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లుగా సమాచారం అందుతుంది.

 Balakrishna Movie Veera Simhareddy Budget And Collections , Balakrishna , Veer-TeluguStop.com

ఈ సినిమా యొక్క బడ్జెట్ విపరీతంగా పెరగడం తో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో అని అంతా ఆసక్తి గా ఎదురు చూశారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు స్వయం గా తమ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారానే విడుదల చేయబోతున్నారు.

మైత్రి మూవీ వారు ఈ మధ్య కాలం లో భారీ బడ్జెట్ సినిమాలను వరుసగా నిర్మిస్తున్నారు.అందులో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

మరి వీర సింహా రెడ్డి సినిమా ఫలితం ఎలా ఉంటుందో అంటూ విశ్లేషకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.ఈ సమయం లో బాలకృష్ణ సినిమా కు 100 కోట్ల రూపాయలకు మించి బడ్జెట్ పెట్టడం అనేది మైత్రి మూవీ మేకర్స్ వారు చేసిన పెద్ద తప్పు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం బాలయ్య సినిమా సక్సెస్ అయితే 100 కోట్ల కాదు 200 కోట్ల రూపాయల వసూలు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది.

కనుక మైత్రి మూవీ మేకర్స్ వారు వీర సింహా రెడ్డి సినిమా కు 100 కోట్ల రూపాయలను పెట్టడం తప్పేం కాదు అంటూ అభిమానులు చాలా ధీమా తో చెబుతున్నారు.మరి సంక్రాంతికి బాలయ్య తన వీర సింహా రెడ్డి సినిమా తో సక్సెస్ దక్కించుకుని మైత్రి మూవీ మే కర్స్ వారికి లాభాలను తెచ్చి పెడతాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube