బాలీవుడ్ ని మళ్ళీ భయపెడుతున్న కరోనా, తెలుగు సినిమా పరిస్థితి ఏంటో!

ఒకప్పుడు బాలీవుడ్ వారు సౌత్ సినిమా లను చాలా చిన్న చూపు చూసే వారు.అక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా వారు కూడా తెలుగు తమిళ సినిమాలు అంటే నాసిరకం సినిమాలు అనే అభిప్రాయంతో ఉండే వారు.

 Corona Scares Bollywood Again Details, Bollywood, Corona, Covid 19, South Movie,-TeluguStop.com

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది.కరోనా తర్వాత బాలీవుడ్ కంటే అతి పెద్ద ఇండస్ట్రీగా సౌత్ సినీ ఇండస్ట్రీ మారి పోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బాలీవుడ్ లో విడుదల అవుతున్న సినిమా లు నూటికి ఒకటి లేదా రెండు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి.అక్కడ సక్సెస్ రేట్ చూస్తూ ఉంటే నిర్మాతలు సినిమా లను తీయడానికి కూడా భయపడుతున్నారు.

ఎక్కువ శాతం సినిమాలు అక్కడ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.థియేటర్ల ద్వారా విడుదల చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

ఒకప్పుడు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన స్టార్ హీరోలు కూడా ఇప్పుడు దారుణమైన కలెక్షన్స్ రావడంతో ఏం చేయాలో పాలు పోక జుట్టు పీక్కుంటున్నారు.ఈ సమయం లో కరోనా మరో సారి ఇండియాలో తాండవం చేయబోతుంది అనే ప్రచారం జరుగుతుంది.

ఫిబ్రవరి నుండి దాదాపు 3 లేదా 4 నెలల పాటు కరోనా కేసులు విపరీతంగా ఇండియా లో పెరిగే అవకాశం ఉందట.ఆ సమయం లో బాలీవుడ్ లో కాని ఇతర సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అయ్యే అవకాశాలు లేవు, ఆ తర్వాత సౌత్ ఇండియాలో మళ్లీ యధావిధిగా సినిమాల రిలీజ్ ఉంటాయి.కానీ బాలీవుడ్ లో మాత్రం మరింత దారుణమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రం కరోనా తర్వాత మళ్లీ యధావిధి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube