నల్లమల్ల దారి దోపిడీ కేసులో పురోగతి

నల్లమల్ల దారి దోపిడీ కేసులో పురోగతి లభించింది.ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలో చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన నంద్యాల, ప్రకాశం జిల్లాల పోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు.

అనంతరం వారి వద్ద నుంచి బంగారం, నగదును రికవరీ చేశారు.దోపిడీ తర్వాత మహానందికి వెళ్లిన నిందితులు యాత్రికుల్లా రిలాక్స్ అయ్యారని పోలీసులు వెల్లడించారు.

రహదారిపై కారును అడ్డుకున్న నిందితులు బంగారం వ్యాపారులను బెదిరించి 700 గ్రాముల బంగారం, రూ.

7 లక్షల నగదును అపహరించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే.

చాక్లెట్ ప్లేన్‌గా ఉందని కస్టమర్ ఫిర్యాదు.. కంపెనీ అతనికి చెల్లించిన నష్టపరిహారం ఎంతంటే..?