కేసీఆర్ మ‌రో ముందు జాగ్ర‌త్త‌.. ప్ర‌తిప‌క్షాల ఎఫెక్టేనా...?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు అన్ని పార్టీల‌ను కేసీఆర్ డిసైడ్ చేసేవారు.ఎవ‌రెన్ని మాట్లాడినా వాటిని క‌నీసం లెక్క‌చేయ‌కుండానే త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయేవారు.

 Precautions Before Is It The Effect Of The Opposition Kcr, Revant,latest News-TeluguStop.com

ఎవ‌రైనా ఎదురు తిరిగి నిర‌స‌న‌ల్లాంటివి తెలిపితే త‌న‌దైన స్టైల్ లో దాన్ని క‌నీసం ఉనికే లేకుండా చేసేవారు.అలాంటి వ్య‌క్తి ఇప్పుడు చాలా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇప్పుడు చిన్న చిన్న విష‌యాల‌ను కూడా ప‌ట్టించుకుంటున్నారు.

ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్షాలు గొంతెత్తి అరిచినా ప‌ట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎవ‌రేం అడిగినా దానికి రియాక్ట్ అవుతున్న‌ట్టు కనిపిస్తోంది.

ఎప్ప‌టి నుంచో డిమాండ్ లో ఉన్న జాబ్స్ నోటిఫికేష‌న్ అదే నండి 50వేల ఉద్యోగాల క‌ల్ప‌న‌పై ఇప్పుడు కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.త్వ‌ర‌లోనే జాబ్ నోటిఫికేష‌న్లు వేస్తామంటూ ప్ర‌క‌టించారు.

ఈయ‌న ఇలా ప్ర‌క‌టించిక‌ముందు బీజేపీ నాయ‌కులు నిరుద్యోగాన్ని బేస్ చేసుకుని చాలా వ‌ర‌కు ధ‌ర్నాలు చేస్తున్నారు.ఇక కొత్త‌గా వ‌చ్చిన ష‌ర్మిల కూడా నిరుద్యోగ ఎజెండాను మాత్ర‌మే ఎత్తుకుని ముందుకు సాగుతున్నారు.

Telugu @cm_kcr, @revanth_anumula, Congress, Sharmila, Telongana, Ysrtp-Telugu Po

ఇక కాంగ్రెస్‌కు కొత్త బాస్ అయిన రేవంత్ కూడా ఇదే నిరుద్యోగాన్ని అస్త్రంగా చేసుకుని పోరాటాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.ఇలా అంద‌రూ మూకుమ్మ‌డిగా ఒకే అస్త్రాన్ని ఎత్తుకోవ‌డంతో వారికి అవ‌కాశం ఇవ్వ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేష‌న్ జారీ చేశార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఇలా చేస్తే ఎవ‌రికీ మాట్లాడే అవ‌కాశం ఉండ‌ద‌ని, అప్పుడు యూత్ ను కూడా త‌న‌వైపు తిప్పుకోవ‌చ్చే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.మొత్తానికి కేసీఆర్ ఏది చేసినా దానికి చాలా ముందు చూపు ఉంటుంద‌నేది ఇదివ‌ర‌కే ఆయ‌న‌కు బిరుదు ఉంది.

ఇప్పుడు కూడా భ‌విష్య‌త్తులో ఏ పార్టీ కూడా బ‌ల‌ప‌డ‌కుండా ఉండేందుకు ఆయ‌న ప‌క్కా ప్లాన్ వేస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.చూడాలి మ‌రి ప్ర‌తిప‌క్షాలు ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్తాయ‌నేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube