ఎండనక , వాననకా, కాళ్ళు బొబ్బలు ఎక్కేలా తిరుగుతూ .ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర చేస్తున్నాడు.
యాత్ర ఫలితమే, అధికార పార్టీపై వ్యతిరేక తెలియదు కానీ జగన్ కు ప్రజలు బ్రమ్మరథం పడుతున్నారు.గతం కంటే వైసీపీకి బలం పెరిగింది.
పార్టీని విడిచి వెళ్ళినవారు, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వైసీపీలోకి క్యూ కడుతున్నారు.

గత ఎన్నికల్లో విజయం చివరి అంచుల వరకు వచ్చి అవకాశం కోల్పోయాడు.ఈసారి అటువంటి తప్పు జరగకూడదని ముందు నుంచే మేల్కొని పార్టీలో అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాడు జగన్.ఈ దశలోనే ప్రశాంత్ కిషోర్ ( పీకే ) అనే వ్యూహకర్తను నియమించుకుని రాజకీయంగా బలం పెంచుకునేందుకు అతని సలహాలు సూచనలు పాటిస్తున్నాడు.
పార్టీ స్థితిగతులు, నాయకుల తీరు, ప్రజలలో పార్టీపై ఉన్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని దానికి అనుగుణంగా వ్యూహాలను వెయ్యడం పీకే పని.
మొదట్లో ఈ టీమ్ సర్వేల పేరుతో హడావుడి చేసింది.నాయకుల పనితీరు మీద రిపోర్టులు ఇస్తూ జగన్ ని అప్రమత్తం చేస్తూ ఉండేది.అయితే రాను రాను పీకే టీమ్ మీద జగన్ కూడా ఇంట్రెస్ట్ తగ్గించేసాడు.
ప్రస్తుతం ఈ టీం వల్ల వైసీపీకి ఎటువంటి లాభం లేదని తెలుస్తుంది.ప్రశాంత్ కిషోర్‌ని నియమించి సంవత్సరం దాటిన ఇప్పటి వరకు పార్టీపై పట్టు సాధించలేకపోయారు.
ఢీల్లీ, బిహార్‌లలో ప్రజలను అంచనా వేయడంలో పీకే టీం సఫలం చెందింది.కానీ ఇక్కడ అలాంటి వ్యూహాలు పనికి రావని,ఇక్కడ చదువుకున్న వారికన్నా చదువుకోని వారే ఎక్కువ ఉంటారు.
వారిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచించాలి కాని ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఏపీలో పెద్దగా ఎవరు పట్టించుకోరన్న సంగతి పీకే టీమ్ మర్చిపోతోంది.అసలు పీకే టీం ఇప్పటి వరకు ఏం సాధించిందో ఎవరికి తెలియదు.
ఇక టీడీపీ ఇప్పటికే వైసీపీ అనుకుల సోషల్ మీడియాపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడున్నా పరిస్థితులను బట్టి చూస్తే వైసీపీకి కొంత అనుకూలంగానే ఉందని చెప్పాలి.
ఈ వేవ్ ను చంద్రబాబు మార్చేయగలడని, చంద్రబాబుకి పోల్ మేనెజ్‌మెంట్ బాగా తెలుసునని దీన్ని పీకే టీమ్ ఎలా ఎదుర్కొంటుందని వాదన ఇప్పుడు అందరిలోనూ వ్యక్తం అవుతోంది.ఇప్పటి వరకు పీకే టీం వైసీపీ నాయకులతో కనెక్ట్ కాలేదు.
దీని బట్టి చూస్తే పీకే టీం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.