ఢిల్లీలో ఈరోజు ఉదయం కాంగ్రెస్ పెద్దల సమక్షంలో వైయస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం తెలిసిందే.ఈ సందర్భంగా తన తండ్రి వైయస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన మేలులను గుర్తు చేసుకుని రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తాను కూడా కష్టపడతానని షర్మిల తెలియజేశారు.
పరిస్థితి ఇలా ఉంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం పట్ల స్పందించారు.
ఇటీవల పార్టీ నాయకులతో మరియు కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో పొత్తు ఇంకా రకరకాల అంశాలపై చర్చించిన అనంతరం.పురంధేశ్వరి ( Purandeshwari )మీడియాతో మాట్లాడటం జరిగింది.ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలలు మాత్రమే సమయం ఉంది.
దీంతో ఏ రకంగా ఎన్నికలను ఎదుర్కోవాలి సంస్థగతంగా పార్టీ ఎంత బలోపేతంగా ఉంది అన్నదానిపై చర్చలు జరిగాయి.ఈ క్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు… పార్టీ పెద్దలకు తెలియజేయడం జరుగుద్ది.
వచ్చే ఎన్నికలలో పొత్తులకి సంబంధించి ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయం ఫైనల్ అని అన్నారు.జనసేనతో ఇంకా మిత్రపక్షంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు.ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జాయిన్ కావడం పట్ల ప్రశ్నించారు.షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు.
ప్రస్తుత పరిస్థితుల్లో మా పార్టీని బలోపేతం చేసుకోవటం ముఖ్యం అంటూ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు చేయడం జరిగింది.