టాలీవుడ్ జక్కన్న రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏది అంటే ప్రతి ఒక్క సినీ అభిమానికి కూడా వెంటనే గుర్తుకు వచ్చే పేరు మహాభారతం.ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై మహాభారతం కథ లతో ఎన్నో సినిమాలు వచ్చాయి.
అయినా కూడా రాజమౌళి చేస్తానన్న మహాభారతం సినిమా కోసం ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేమికుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆయన బాహుబలి సినిమా ప్రమోషన్ సమయం లో ఎక్కువ సార్లు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అంటూ వెల్లడించడంతో పాటు అందుకు కనీసం 10 ఏళ్ల సమయం పడుతుంది అని ముందే తెలియ జేశాడు.
ఆ సినిమా నే తన సినీ కెరీర్ కి చివరి సినిమా అవుతుందేమో అని కూడా చెప్పుకొచ్చాడు.బాహుబలి ప్రమోషన్ సమయంలో మహా భారతం గురించి ఎక్కువ చర్చ జరిగింది.
![Telugu Baahubali, Dream Project, Mahabharatham, Prabhas, Rajamouli, Technical-Mo Telugu Baahubali, Dream Project, Mahabharatham, Prabhas, Rajamouli, Technical-Mo](https://telugustop.com/wp-content/uploads/2022/03/prabhas-rajamouli-baahu.jpg )
ఇప్పుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ సమయం లో బాహుబలి 3 సినిమా కు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.భారీ మల్టీ స్టారర్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా పలు మీడియా సమావేశాలలో పాల్గొన్న రాజమౌళి బాహుబలి 3 కి సంబంధించిన విషయమై క్లారిటీ ఇచ్చాడు.తప్పకుండా బాహుబలి 3 ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.అదే సమయంలో రాజమౌళి నుండి మరింత క్లారిటీ కూడా తాజాగా లభించింది. ప్రభాస్ ఓకే అనడంతో పాటు బారీ టెక్నికల్ టీమ్ కూడా రెడీగా ఉండడం వల్ల బాహుబలి 3 త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ రాజమౌళి ముచ్చటించారు.
ఆ సమయంలో కూడా బాహుబలి గురించి చర్చ మొదలైంది.కనుక అతి త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని.
అది బాహుబలి 3 అవుతుందని నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.మరి రాజమౌళి ఎప్పుడు బాహుబలి 3 చేస్తాడు అనేది చూడాలి.
ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత రాజమౌళి చేయాల్సిన సినిమా మహేష్ బాబు తో అనే విషయం తెలిసిందే.ఆ సినిమా తర్వాత మళ్ళీ ప్రభాస్ సినిమా చేస్తాడో లేదో చూడాలి.