యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా కేజీఎఫ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ ( Prashanth neel )దర్శకత్వం లో సలార్ రూపొందుతున్న విషయం తెల్సిందే.సలార్ ను రెండు భాగా లుగా విడుదల చేయబోతున్నారు.
అందుకు సంబంధించిన హడావుడి మొదలు అయ్యి చాలా కాలం అయింది.కానీ ఇప్పటి వరకు విడుదల అవ్వక పోవడం పై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

డిసెంబర్ నెలలో సలార్ సినిమా ను విడుదల చేసే విధంగా ఇప్పటికే కొత్త తేదీని ప్రకటించారు.మరో వైపు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను చకచక చేస్తున్నారు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం లో చాలా నెంబర్స్ ఆశ్చర్యం ను కలిగిస్తున్నాయి.కేవలం తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.160 కోట్ల కు పైగా బిజినెస్ చేసి సర్ ప్రైజ్ చేసింది.ఈ రేంజ్ లో భారీ ఎత్తున బిజినెస్ చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సలార్ సినిమా రూ.300 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

మరి అంత సాధ్యమా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.ఒక వైపు సలార్ ( Salaar )భారీ వసూళ్ల నేపథ్యం లో పాన్ ఇండియా స్థాయి లో రూ.700 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది.ఒక వేళ సలార్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తే కచ్చితంగా అందులో ఏడు వందల కోట్లు బయటి నుంచి రావాల్సి ఉంది.తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత గట్టిగా ప్రయత్నించినా కూడా రూ.300 కోట్లు సాధ్యమేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సలార్ సినిమా లో భారీ సెట్టింగ్స్ తో కమర్షియల్ గా మాస్ ఎలిమెంట్స్ తో సన్నివేశాలు ఉంటాయట.
అందుకే వెయ్యి కోట్ల టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం ఏమీ కాకపోవచ్చు అంటున్నారు.