కాంగ్రెస్ కి భారీ షాక్.. వారి నిరసనల వెనుక ఉన్నది కేసీఆరేనా..?

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది తెలంగాణలో ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న బీఆర్ఎస్( BRS ) , బీజేపీ,కాంగ్రెస్ ల మధ్య మరింత పోటీ తత్వం పెరుగుతుంది.అయితే ఈసారి బీజేపీ ( BJP ) అంతా హుషారుగా లేనట్టు కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ చేస్తూ ప్రతి నిత్యం ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతుంది కాంగ్రెస్.

 Big Shock To Congress.. Is Kcr Behind Their Protests , Kcr , Farmers , Protests-TeluguStop.com

ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులను తమ వైపు తిప్పుకొని పార్టీ కండువాలు కప్పారు.ఇక వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కేసిఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులను తన రాజకీయ చతురత తో బీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ( Congress ) తమకి గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఎలాగైనా కాంగ్రెస్ కి షాక్ ఇవ్వాలి అని కేసీఆర్ ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారట.అయితే తాజాగా కొడంగల్, గద్వాల లో కర్ణాటక రైతులు తమకి కరెంటు రావడం లేదు అని రోడ్డు మీదికి ఎక్కి నిరసనలు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.

అయితే కర్ణాటక రైతులు ఇలా రోడ్డెక్కి నిరసన తెలపడం వెనుక గులాబీ బాస్ స్కెచ్ ఉన్నట్టు సమాచారం.

Telugu Congress, Farmers, Karanataka, Karnataka, Kodangal, Rahul Gandhi, Telanga

అయితే స్వయంగా కేసీఆర్ ( KCR ) స్కెచ్ వేసి మరీ వారిని కొడంగల్, గద్వాలలో నిరసనలు చేసేలా చేశారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వారి మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క పని కూడా ఆచరణలోకి తేవడం లేదని,ఆల్రెడీ గెలిచిన కర్ణాటకలోనే రైతులను ప్రజలను పట్టించుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ స్వయంగా కర్ణాటక ( Karnataka ) రైతులను తెలంగాణలో ఇలా నిరసనలు చేసేలా ప్లాన్ వేసి మరీ రోడ్డెక్కెలా చేశారని మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Congress, Farmers, Karanataka, Karnataka, Kodangal, Rahul Gandhi, Telanga

తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువస్తే కర్ణాటకలో ఉండే రైతులు ఎలా అయితే కాంగ్రెస్ నాయకులతో ఇబ్బంది పడుతున్నారో అలాగే తెలంగాణ( Telangana ) లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని కేసీఆర్ పరోక్షంగా కర్ణాటక రైతులతో ఇలాంటి పని చేయించారని తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ ఎన్నికల వేళ తెలంగాణలో కర్ణాటక రైతుల నిరసన ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube