యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాదాక్రిష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరోసా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి రాధేశ్యామ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణా స్టూడియోస్ లో వేసిన రిట్రో పారిస్ సిటీ సెట్ లో జరుగుతుంది.ఇక ఇందులో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందిలా ఉంటేలో బాలీవుడ్ ప్రేక్షకులని సైతం దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కోసం హిందీ చిత్రసీమకి చెందిన నటులని కూడా తీసుకుంటున్నారు.ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ కీలక పాత్రలో నటించడానికి సిద్ధం వుతుంది.
ఇది ఆమె రీఎంట్రీ మూవీ.
పీరియాడికల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మరో బాలీవుడ్ నటుడుని చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది.
డిస్కో డాన్సర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన నటుడు మిదున్ చక్రవర్తి.తెలుగులో గోపాల గోపాల సినిమాలో స్వామీజీ పాత్రలో కనిపించిన నటుడు అంటే అందరికి సుపరిచితం.
ఇక ప్రభాస్ సినిమా కోసం ఈ నటుడుని చిత్ర దర్శకుడు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఇతను చేసేది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది.
అయితే అది మయిన్ విలనా లేదంటే ఓ కీలక పాత్ర కోసం మాత్రమేనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.