ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ లుగా ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఆ వార్తలు నిజమే అన్నట్లుగా దర్శకుడు మారుతి ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చాడు.ఇప్పటికే మాళవిక నాయర్ ఈ సినిమా లో నటిస్తున్నట్లుగా అఫిషియల్ గా కన్ఫర్మ్ అయింది.
ఇక గత కొన్నాళ్లుగా నిధి అగర్వాల్ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది.ఇటీవల జరిగిన షెడ్యూల్ లో ప్రభాస్ తో కలిసి నిధి అగర్వాల్ కలిసి పాల్గొందని తేలిపోయింది.
దాంతో సినిమా లో నిధి అగర్వాల్ నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయింది.ఈ మధ్య కాలంలో నిధి అగర్వాల్ కి సినిమా లు లేవు.

అయితే పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.కానీ ఆ సినిమా మధ్య లో నిలిచి పోయింది.ఇప్పుడు ప్రభాస్ సినిమా లో ఆమె నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ వార్తలు కన్ఫర్మ్ అయింది.దాంతో నిధి అగర్వాల్ ఈ రెండు సినిమా లు కనుక హిట్ చేసుకోగలిగితే కచ్చితంగా స్టార్ డమ్ ను సొంతం చేసుకోవచ్చు అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ సినిమాలో హీరోయిన్ రోల్ అంటే పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు రావడం కన్ఫర్మ్.
మరి మారుతి ఏం చేస్తాడో చూడాలి.సలార్ సినిమా తర్వాత కల్కి సినిమా తో ప్రభాస్ రాబోతున్నాడు.
ఆ తర్వాత మారుతి దర్శకత్వం లో సినిమా తో ప్రభాస్ వస్తాడని అంటున్నారు.ప్రభాస్ యొక్క సినిమా అనగానే యాక్షన్ అనుకుంటారు.
కానీ మారుతి అందుకు విరుద్దంగా చాలా కొత్తగా విభిన్నంగా ప్రభాస్ తో సినిమా ను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.