యాంకర్ సుమ( Suma ) కుమారుడు రోషన్ ( Roshan ) త్వరలోనే బబుల్ గమ్( Buble Gum ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అన్నింటిని కూడా సుమ తన భుజాలపై వేసుకున్నారు.
ఈ క్రమంలోనే సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సుమా అడ్డ ( Suma Adda ) అనే కార్యక్రమానికి ఈ సినిమా చిత్ర బృందం హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమానికి రోషన్ తండ్రి రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) కూడా హాజరయ్యారు.
ఇక ఎప్పటిలాగే సుమ తన మాట తీరుతో పెద్ద ఎత్తున అందరిని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజీవ్ ఎర్రటి గులాబీ పువ్వులను సుమకు ఇస్తూ ప్రపోజ్ చేశారు.ఇలా సుమకు ప్రపోజ్ చేయడం ఈ ప్రోమోలో చాలా హైలెట్ గా నిలిచింది ఇక సుమలో మీకు నచ్చేది ఏంటి అంటూ ప్రశ్నించడంతో రాజు తన నవ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పగా నవ్వడం ఈ ప్రోమోలో చాలా హైలెట్ అయింది.ఇక ఈ ప్రోమోలో భాగంగా రోషన్ అలాగే హీరోయిన్ మానస చౌదరి ఇద్దరు కూడా భారీ స్థాయిలో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు వీరి రొమాన్స్ చూడలేక సుమ మొహం చాటేయటం గమనార్హం.

ఉప్పెన సినిమాలోని జలజల జలపాతం నువ్వు అని సాగే పాట ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సుమ అడ్డ కార్యక్రమంలో రోషన్ హీరోయిన్ మానస చౌదరితో కలిసి ఈ పాటకు రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు పక్కనే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ రోషన్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.ఇలా వీరిద్దరి రొమాన్స్ పిక్స్ కి చేరడంతో అది చూడలేక సుమా తన చీర కొంగును మొహానికి అడ్డు వేసుకుంది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







