తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘బాహుబలి’.ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళ్లాయి.వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తాజాగా వెబ్ మీడియాలో లీక్ అయ్యింది.
అయితే ఆ కథ ఎంత వరకు నిజమో తెలయదు కాని, ప్రస్తుతం అది ఒక వైరస్‌లా అంతా వ్యాప్తి చెందుతోంది.
ఇంతకు ఆ కథ ఏంటంటే… మహిష్మతి రాజు అమరేంద్ర బాహుబలి(ప్రభాస్).
ఆయన సతీమణి దేవసేన(అనుష్క).బాహుబలి పాలనలో మహిష్మతి రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు.
అయితే బిజ్జల దేవ(నాజర్) దురుద్దేశ్యంతో బాహుబలి తమ్ముడు అయిన భల్లలదేవ(రానా)కు చెడును నూరి పోసి, రాజ్యం దక్కించుకునేందుకు బాహుబలిని చంపేయమని సలహా ఇస్తాడు.రాజ్య కాంక్షతో భల్లలదేవ తన అన్న బాహుబలిని చంపేస్తాడు.
దేవసేనను ఖైదీగా చేస్తాడు.బాహుబలి, దేవసేనల తనయుడిని భల్లలదేవ బారి నుండి కాపాడి పక్కరాజ్యంకు చేర్చుతాడు.
అక్కడి వారి వద్ద శివుడుగా బాహుబలి తనయుడు పెరుగుతాడు.ఒకానొక సమయంలో మహిష్మతి రాజ్యంకు శివుడు వెళ్తాడు.
అక్కడ తన గత గురించి, తన తండ్రి గురించి తెలుసుకుంటాడు.ఆ తర్వాత భల్లలదేవపై ప్రతీకార యుద్దం చేస్తాడు.
ఆ యుద్దంలో శివుడు గెలిచి తన రాజ్యంను దక్కించుకుంటాడు.తల్లిని ఖైదు నుండి విడిపిస్తాడు.
ఈ కథను రాజమౌళి విజువల్ వండర్‌గా, తనదైన స్టైల్‌లో తెరకెక్కించాడు.కథ సింపుల్‌గానే ఉన్నా కూడా కథనం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.