తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ హన్సిక.ఈ అమ్మడి మొదటి తెలుగు సినిమా ‘దేశముదురు’.
ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.ఆ సినిమా వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు హన్సిక వెనక్కు తిరిగి చూడకుండా దూకుడుగా దూసుకు పోతూనే ఉంది.
తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన హన్సిక అటు తమిళంలో కూడా ఈ అమ్మడు క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది.అయితే ఎంత మంది హీరోలతో చేసినా కూడా ఈమె బన్నీతో మొదటి సినిమా తర్వాత ఇప్పటి వరకు చేసింది.
లేదు.ఇప్పుడు ఈ కాంబోలో మూవీ రాబోతుంది.
‘దేశముదురు’ చిత్రంలో ఆకట్టుకున్న అల్లు అర్జున్, హన్సికల జంట మళ్లీ రొమాన్స్ చేయబోతుంది.అల్లు అర్జున్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా హన్సికను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
తమిళంలో యమ బిజీగా ఉన్నప్పటికి తన మొదటి హీరో అవ్వడం వల్లే ఈ సినిమాలో నటించేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇన్నాళ్లకు రొమాన్స్ చేయబోతున్న ఈ జంట మరోసారి ఆకట్టుకుంటారో చూడాలి.