ప్రస్తుతం రాజమౌళి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగి పోతోంది.ఈయన దర్శకత్వంలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూలో నిల్చునేందుకు సిద్దంగా ఉన్నారు.
కొమ్ములు తిరిగిన హీరోలు కూడా ఈయన అడిగితే ఎన్ని డేట్లు అంటే అన్ని డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.అటువంటిది ఈయనకు మాత్రం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేయాలనే కోరిక ఉంది.
అలాగే ఈయనకు తమిళ స్టార్ హీరోలు సూర్య మరియు అజిత్‌లతో కూడా సినిమా చేయాలనే కోరిక ఉన్నట్లుగా తాజాగా చెప్పుకొచ్చాడు.
ఇటీవలే ‘బాహుబలి’ తమిళ ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు.
ఈయనతో సినిమాలు అంటే వారు కూడా ఎగిరి గంతేస్తారు.తన తర్వాత సినిమాను వీరిలో ఎవరితో అయినా తీస్తాడేమో చూడాలి.
ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ క్రేజీ మూవీ ‘బాహుబలి’ విడుదలకు సిద్దం అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను జులై 10న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.







