గత రెండు సంవత్సరాలుగా పవన్ ఫ్యాన్స్ ‘గబ్బర్‌సింగ్`2’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.
ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది.అతి త్వరలో రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్లుగా దర్శకుడు బాబీ చెప్పుకొచ్చాడు.
శరత్ మారార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.త్వరలో రెండవ షెడ్యూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ గురించి ఫిల్మ్ సర్కిల్స్ నుండి షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమా అనుకున్నప్పటి నుండి కూడా టైటిల్‌గా ‘గబ్బర్‌సింగ్`2’ ప్రచారం జరుగుతూ వస్తోంది.షూటింగ్ ప్రారంభోత్సవం సమయంలో కూడా నిర్మాత, దర్శకుడు ‘గబ్బర్‌సింగ్`2’ ప్రారంభం అయ్యింది అంటూ ప్రకటించారు.
అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమా టైటిల్‌ను మార్చబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే ఈ సినిమా కోసం ‘సర్దార్’ టైటిల్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.‘గబ్బర్‌సింగ్`2’పై కంటే కూడా ‘సర్దార్’ టైటిల్‌పైనే పవన్ ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు ‘గబ్బర్‌సింగ్`2’ అని టైటిల్‌గా పెడితే ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఆ ‘గబ్బర్‌సింగ్’తో పోల్చి చూస్తారనే భావన చిత్ర యూనిట్ సభ్యుల్లో ఉంది.
దానికి, దీనికి సంబంధం లేదు కనుకే టైటిల్ మార్పు అన్నట్లుగా తెలుస్తోంది.త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.