'లైఫ్ అంటే ఇట్టా ఉండాలి'.. స్పెషల్ సాంగ్ తో పూజా ఎంట్రీ.. గెట్ రెడీ..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ లతో వరుస విజయాలను అందు కుంటున్నాడు.

 Pooja Hegde Special Song From F3 Movie Out Now Details, Pooja Hegde, Pooja Hegde-TeluguStop.com

ప్రెసెంట్ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.

ఎఫ్ 3 సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.ఇక ఇటీవలే మరో పాట కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ రోల్ లో నటిస్తుంది అనే విషయం విదితమే.

ఈమె చేసిన స్పెషల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను ఈ రోజు రిలీజ్ చేసారు.లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అనే సాంగ్ కు పూజా ఆడిపాడినట్టు తెలుస్తుంది.ఈ సాంగ్ లో వరుణ్ తేజ్, వెంకటేష్ పూజా హెగ్డే తో పోటీ పడి మరీ వేశారు.ఈ ప్రోమో అందరిని ఆకట్టు కుంటుంది.

ఇక ఎప్పటి లాగానే పూజా తన అందచందాలతో అలరించింది.ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటేనే అర్ధం అవుతుంది ఈమె అందాల ఆరబోత ఏ రేంజ్ లో చేసిందో.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమా కూడా నవ్వించడం ఖాయంగా కనిపిస్తుంది.మరి సమ్మర్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి టీమ్ అంతా సిద్ధం అవుతుంది.చూడాలి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube