పుట్టిన రోజు అందుబాటులో లేనంటున్న బుట్ట బొమ్మ.. మాల్దీవ్ వెకేషన్ లో పూజ హెగ్డే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పూజా హెగ్డే ( Pooja Hedge ) ఒకరు ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి ఈమె అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో వెలుగు వెలిగారు.అయితే ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే టైం ఏ మాత్రం బాగాలేదని తెలుస్తుంది.

 Pooja Hedge Enjoying Her Birthday In Maldives Photos Goes Viral, Pooja Hedge, Ma-TeluguStop.com

ఈమె కమిట్ అయిన సినిమాలు నుంచి తప్పుకోవడం లేదా సినిమా షూటింగులు ఆగిపోవడం లేదా ఈమె నటించిన సినిమాలో డిజాస్టర్లుగా మిగలడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.

ప్రస్తుతం ఎలాంటి సినిమా అవకాశాలు లేకుండా పూజా హెగ్డే సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తుందని చెప్పాలి.ఇలా సోషల్ మీడియా వేదికగా తరచు తనకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.ఇకపోతే నేడు పూజాహెగ్డే పుట్టిన రోజు( Birthday ) కావడంతో ముందుగానే తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్( Maldives ) కి చెక్కేసింది.

ఇలా తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళినటువంటి ఈమె అక్కడ వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా సముద్రంపై నెట్ బెడ్ మీద ఎంతో ప్రశాంతంగా పడుకొని ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేను ఎవరికీ అందుబాటులో లేను అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటోపై పలువురు విభిన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈమె పుట్టినరోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం పూజ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పూజ హెగ్డే ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube