ఖమ్మం జిల్లా: పాలేరు అత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కామెంట్స్… జనవరి 1 నుండి అన్ని నియోజకవర్గాలలో దీవెనలు, ఆశీర్వాదం కోసం అత్మీయ సమ్మేళనం నిర్వహించాం.సమ్మేళనాలు ఎందుకు పెడుతున్నానో అందరికీ తెలుసు.
ఆరు దశాబ్దాల కు పైగా సబ్బండ వర్గాల ప్రజలు పోరాటం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది ప్రాణాల త్యాగాల వల్లే ప్రత్యేక రాష్ట్రం.
సాధించిన తెలంగాణ లో ధనిక రాష్ట్రంలో తెలంగాణ వచ్చాక ఏ విధంగా ధనికులు అయ్యారు….ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు తెలుసు.
నాలుగు లక్షల 56 వేల కోట్లు అప్పు చేసింది.ఈ ధనం అంతా నిన్న బిడ్డ తో పాటు లక్షా 60 వేలు అప్పు.
తెలంగాణ నినాదం ఏమిటి నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం.చివరికి యువత కు మిగిలింది ఆత్మహత్య లే…ఎంత మంది కి నియామకాలు చేపట్టారు.
అసెంబ్లీ సాక్షి గా హామీ లు ఇచ్చారు… అత్మపరిశీలన చేసుకోవాలి.ఇందుకోసమా నా బిడ్డ అత్మ బలిదానం చేసుకుంది అని బాధపడుతున్నారు.2018లో లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తాం అన్నారు….
రుణ మాఫీ చేసిన రైతులు 5లక్షల మంది కి ఇంకా 31 లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి.
ఇంకా ప్రభుత్వం ఉండేది 8 నెలలే.ఉప ఎన్నికలు వస్తే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు… దళిత బంధు ఇచ్చినా ఫలితం ఏమిటో చూశాం.
దళిత బంధు పట్ల చిత్త శుద్ధి ఏమిటో ఆర్దం అవుతుంది.గిరిజన బంధు అన్నారు… ఇప్పటి వరకు అమలు లేదు.
డబుల్ బెడ్ రూం ఇళ్ళు లో ఒక్క గ్రామంలో నైనా 50 ఇళ్ళు కట్టారా.చేటలో తవుడు పోసి పిచ్చి కుక్క లు గా కొట్టుకోవాలని చేసింది.
రాబోయే ఎన్నికలలో ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎవరూ మోసపోతారో చూస్తారు.హెల్త్ పాలసీలొ 4.2శాతం బడ్జెట్ లో కేటాయించారు… వైద్య రీత్యా సామాన్య ప్రజలు పట్ల శ్రద్ధ ఆర్దం అవుతుంది.విద్యా రంగంలో దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలలో 20 శాతం కేటాయించారు.తెలంగాణ లో ,6.5 శాతమే విద్యకు కేటాయించారు.
సమయం వచ్చిన ప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటా.సీతారామ ప్రాజెక్టు 19, 600 కోట్లు ….ఖర్చు చేసింది 6వేల కోట్లు.ఇంకా 13వేల కోట్లు ఖర్చు పెట్టేది ఎప్పుడు… పూర్తి ఎప్పుడూ అవుతుంది.పాలేరు ప్రజల కాళ్ళు ఎప్పుడూ కడుగుతారు.సీఎం ఆచరణ సాధ్యం కానీ హామీలలో దిట్ట.
మాటలు తప్ప చేతలు చేతకాని సీఎం.తెలంగాణ ప్రజలను మసిబూసి మారెడుకాయులు చేస్తున్నారు.
అనేక ఇబ్బందులు పెట్టారు….రాబోయే ఎన్నికల ఉప్పెనలో ప్రజాప్రతినిధులు అంతా కొట్టకపోతున్నారు.
ఎన్ని పార్టీ లతో పోత్తు లు పెట్టుకున్నా…ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ పార్టీ ఏదైనా శీనన్న ప్రజాప్రతినిధులే గెలుస్తారు.రాష్ట్ర ప్రభుత్వం ను గద్దె దించటం…ఖమ్మం జిల్లాలో ని ప్రజాప్రతినిధులు ను ఇంటికి పంపించటమే ఏజెండా.
ఎన్నికలు రాబోతున్నాయి….అందరూ అప్రమత్తంగా ఉండాలి.