ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా ఏవోబీలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని కటాఫ్ ఏరియా ప్రాంతంలో ఒడిశా మల్కన్‌గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్ మరియు ఏరియా డామినేషన్ నిర్వహించారు.
దీంతో మరిబెడా అటవీప్రాంతంలో మావోయిస్టులకు చెందిన డంప్‌ను కనుగొని వెలికితీసారు.ఈ డంప్‌లో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రీ, యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ పేలుడు సామాగ్రీతో మందుపాతరలు తయారు చేసి వాటిని పౌరులు, పోలీసులను లక్ష్యంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.ఈ మావోయిస్ట్ డంప్‌లో ఒక జనరేటర్, కోడెక్స్ వైర్ మరియు 06 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్ మొదలైనవి ఉన్నాయి.
కోడెక్స్ వైర్ బ్లాస్టింగ్ శక్తిని పలురెట్లుగా పెంచుతుందని పోలీసులు తెలిపారు.ఈ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన డంప్ స్వాధీనం చేసుకోవడం అతి పెద్ద షాక్ అని, ఇవి ఏవోబీ ఎస్‌జడ్‌సీ క్యాడర్‌కు చెందినవిగా అనుమానిస్తున్నట్లు, ఇవి అమాయక పౌరులు, పోలీసులు లక్ష్యంగా అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించడానికి దాచినట్లుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో అదనపు బలగాలను పంపించి గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.