పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ పాలు ఎంతో మేలు చేస్తాయి.కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు పాలలో నిండి ఉంటాయి.
అందువల్లే, రోజుకు ఒక గ్లాస్ పాలు తీసుకుంటే ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు అందుతాయి.ముఖ్యంగా డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించడంలోనూ, గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను తగ్గించడంలోనూ, నిద్ర బాగా పట్టేలా చేయడంలోనూ, జుట్టును దృఢంగా మార్చడంలోనూ, మానసిక సమస్యలను దరి చేరకుండా అడ్డు కట్ట వేయడంలోనూ, ఎముకలను బలంగా తయారు చేయడంలోనూ పాలు అద్భుతంగా సహాయపడతాయి.
అయితే పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.వాటిని తీసుకునే విషయంలో ఖచ్చితంగా పలు జాగ్రత్తలు వహించాలి.లేదంటే ప్రయోజనాలు కాదు దుష్ప్రభావాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.ఇంతకీ పాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపున పాలు తాగుతుంటారు.
కానీ, పాలను ఎప్పుడూ కూడా ఖాళీ కడుపున తీసుకోరాదు.ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పొట్టలో యాసిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అటు వంటి సమయంలో పాలను తీసుకుంటే అందులో ఉండే పోషకాలేవి శరీరానికి అందవు.పైగా గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
అందుకే ఉదయం ఏవైనా ఆహారం తీసుకున్న తర్వాతే పాలు తీసుకోవాలి.
అలాగే కొందరు ఆరోగ్యానికి మంచిదని పాలను అధిక మొత్తంలో తాగుతుంటారు.కానీ, పరిమితికి మించి పాలు తాగితే.బరువు పెరుగుతారు.
రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా నెమ్మదిస్తుంది.
కాబట్టి, ఎప్పుడూ పాలను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.అదే ఆరోగ్యానికి మంచిది.