కర్ణాటకలో బీజేపీకే ప్రజల మద్ధతు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతోనే దేశాభివృద్ధి అని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసం తమకు ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు.25 ఏళ్ల భవిష్యత్ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.ఉచిత పథకాల హామీలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాంగ్రెస్ వారంటీ డేట్ ముగిసిందన్న మోదీ ఈ ఉచిత పథకాలు అభివృద్ధికి విఘాతమని తెలిపారు.