'టర్కీ టీత్'కు ఆకర్షితులవుతున్న ప్రజలు.. డేంజర్ అంటున్న డాక్టర్లు

ప్రపంచంలో ఏదైనా కొత్తగా అనిపిస్తే చాలా మంది వాటిని అనుసరిస్తారు.ట్రెండింగ్ అంశాలను చాలా మంది గుడ్డిగా ఫాలో అయిపోతారు.

 People Who Are Attracted To Turkey Teeth Doctors Say Danger , Torkey Theth, Vira-TeluguStop.com

ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని భావిస్తారు.అందులోనూ ఎవరైనా సెలబ్రెటీలు కొత్త ట్రెండ్ చూపిస్తే, దానిని తెలుసుకుని, అది వాడే వరకు చాలా మందికి నిద్ర పట్టదు.

సెలబ్రెటీలు వాడే దుస్తులు, గాడ్జెట్స్ వంటివి తాము కూడా వాడాలని వారి ఫాలోవర్లు భావిస్తున్నారు.ఇదే తరహాలో ‘టర్కీ టీత్‘ ఇటీవల కాలంలో ట్రెండింగ్‌గా మారింది.

కాస్మెటిక్ డెంటల్ ట్రెండ్, దంతాలను అందంగా మార్చుకోవడానికి విదేశాలకు వెళ్లడం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బాగా ప్రాచుర్యం పొందింది.దీని వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కేటీ ప్రైస్, కెర్రీ కటోనా, జాక్ ఫించమ్‌లతో సహా ప్రముఖులు ఇటీవల కాలంలో టర్కీకి ప్రయాణిస్తున్నారు.

ఇది యూకేలోని చాలా మంది దంత వైద్యులు దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రజలను హెచ్చరిస్తున్నారు.కొన్ని సందర్భాల్లో అనేక మంది రోగుల దంతాలు కుళ్ళిపోవడం, అధిక నొప్పి వంటి బాధాకరమైన సమస్యల గురించి ఫిర్యాదు చేసినట్లు వెల్లడిస్తున్నారు.బ్రిటిష్ డెంటల్ అసోసియేషన్ (బీడీఏ) డెంటల్ టూరిజం గురించి 1,000 మంది దంతవైద్యులను సర్వే చేసింది.95 శాతం మంది దంతవైద్యులు దంత చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన రోగులను పరీక్షించినట్లు నివేదించారు.వీరిలో 86 శాతం మందికి ‘టర్కీ టీత్’ కేసులకు చికిత్స చేసినట్లు చెప్పారు.ఇలాంటి కేసుల్లో డెంటల్ ఇంప్లాంట్లు అమర్చ వలసి వస్తోందని వెల్లడించారు.చాలా మంది చౌకైన దంత చికిత్సకు టర్కీకి వెలుతున్నారని వైద్యులు చెబుతున్నారు.అయితే ఏదైనా సమస్య తలెత్తితే దంతాలకు జరిగిన నష్టాన్ని సరిచేయడానికి రోగులకు కనీసం రూ.48 వేలు (500 పౌండ్లు) ఖర్చవుతుందని దంతవైద్యుల్లో మూడింట రెండు వంతుల మంది చెప్పారు.సగానికి పైగా దీని ధర రూ.94 వేలు (1,000 పౌండ్లు) కంటే ఎక్కువ అని నివేదించింది.ఈ దంతవైద్యుల్లో ఐదుగురిలో ఒకరు ఖర్చు 5,000 పౌండ్లు మించిందని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube