Cm Jagan Ysrcp : గ్రౌండ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు..!

గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు నిరసనలు తప్పడం లేదు.కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి.

 People Protest Ysrcp Gadapa Gadapaku Mana Prabhutvam Program , Ysrcp, Andhra Pr-TeluguStop.com

ఈ కార్యక్రమంలో నిర్వహించకుంటే అధిష్టానానికి కోపం గ్రౌండ్‌కు వెళ్ళితే ప్రజల నుండి నిరసన.ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలాగో సర్దుకుపోదాం అనుకున్న నాయకులకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఇబ్బందిగా మారింది.

ప్రజల నుండే కాదు సొంత పార్టీ నేతల నుండి కూడా నిరసన తప్పడం లేదు.ఇనాళ్ళ తమను పట్టించుకుని నేతలు ఇప్పుడేలా వచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి కన్నబాబుకు సొంత పార్టీ నేతల నుండి  నిరసన ఎదురైంది.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు మరోసారి నిరసన ఎదురైంది.

ఎమ్మెల్యే కన్నబాబుపై దొప్పర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.ప్రభుత్వ పథకాల అమలులో ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కన్నబాబు అరాచకాలు సీఎం జగన్‌కు చేరాలి , కన్నబాబు అరాచకాలు అంతం కావాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు .ఎమ్మెల్యే కన్నబాబుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.కన్నబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఇది పార్టీలో తమ వ్యతిరేక వర్గం చేస్తున్న పని అని కన్నబాబు వర్గం పేర్కొంటోంది.

కన్నబాబు రిటైర్మెంట్‌కు సిద్ధమై ఇప్పుడు తన కొడుకు సుకుమార్ వర్మను వచ్చే ఎన్నికల్లో వారసుడిగా ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తిరుగుబాటు వర్గం అరోపిస్తుంది.

Telugu Andhra Pradesh, Kannababu, Gadapagadapaku, Ysrcp-Political

పెరిగిన ధరలపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పెద్దమురహరిపురంలో మంత్రి అప్పలరాజును ప్రజలు నిలదీశారు.  శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి, పోలేవాండ్లపల్లిలో కదిరి ఎమ్మెల్యే పి.వి.సిద్ధారెడ్డిని రైతులు, సామన్యులు నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube