పోలీస్ ఆఫీసర్ అవతారం ఎత్తిన హాట్ బ్యూటీ

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకొని మంచి జోష్ మీద ఉంది.టాలీవుడ్ కోలీవుడ్ లో వరుసగా సినిమాలకు ఈ భామ సంతకాలు చేసింది.

 Payal Rajput Play Police Officer Role In New Telugu Movie1 New Movie-TeluguStop.com

ఓవైపు నవతరం హీరోలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరో వైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఓ బయోపిక్ లో పాయల్ వేశ్యగా నటించేందుకు సై అనేసింది.స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగ్వేశ్వర్ రావు బయోపిక్ గా చెబుతున్న ఈ మూవీలో వేశ్య పాత్రకు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి ఛాన్స్ ఉండటంతో ఒకే చెప్పేసింది.

మరో వైపు వెంకటేష్ కి జోడీగా వెంకి మామ సినిమాలో రొమాన్స్ చేయబోతుంది.

మరో వైపు మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కో రాజా, అలాగే లేడీ ఒరియాంటెడ్ గా ఆర్డీఎక్స్ లవ్ అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లోనూ నటిస్తుంది.

అలాగే మన్మధుడు సినిమాలో కూడా పాయల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది అని సమాచారం.ఇదిలా ఉంటె తాజాగా ఈ హాట్ బ్యూటీ పోలీస్ గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది.

న్యూ బిగినింగ్, మరో కొత్త తెలుగు సినిమాలో నటిస్తున్నా ఇంకా పేరు పెట్టలేదు.నా కెరీర్ లోనే స్ట్రాంగ్ రోల్ పోషిస్తున్నా, నెర్వస్ గా ఉంది.

మీ ఆశీస్సులు కావాలి అని పోస్ట్ చేసి అందరికి ఊహించని షాక్ ఇచ్చింది.ఈ సినిమాలో పాయల్ సైబర్ క్రైమ్ ని హ్యాండిల్ చేసే సీరియస్ పోలీస్ అధికారిగా నటిస్తోందని అర్థమవుతోంది.

ఇందులో పాయల్ పాత్ర పేరు కె.కిరణ్ అంటూ ఓ అభిమాని గెస్ చేయడం ఆసక్తికరం.అంటే ఐపీఎస్ అధికారి కిరణ్ భేడీ స్ఫూర్తితో తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనే డౌట్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube