అక్కినేని కుటుంబానికి జ్ఞాపకంగా ఉండిపోయిన సినిమా మనం.కుటుంబం మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిపోయింది.
ఇక అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా వారి ఫ్యామిలీకి ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో చాలా ఫ్యామిలీలకి ఒక స్ఫూర్తిగా మారింది.
ఈ నేపధ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా మనం తరహాలో సినిమా చేయాలని ప్లాన్ చేసారు.అయితే అది వర్క్ అవుట్ కాలేదు.
ఇదిలా ఉంటే తాజాగా రాజశేఖర్ తన కూతుళ్ళతో కలిసి మనం తరహాలో సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
జీవిత, రాజశేఖర్ ఇద్దరూ నటులు అనే విషయం అందరికి తెలిసిందే.
ఇప్పుడు వారి కూతుళ్ళు శివాని, శివాత్మిక కూడా తల్లి, తండ్రి వారసత్వం తీసుకొని ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యేందుకు అడుగు పెట్టారు.ఇప్పుడు ఈ నలుగురూ కలసి ఓ సినిమాలో నటించబోతున్నారు.
కథ కూడా సిద్ధమైంది.సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.దర్శకుడు ఎవరన్నది త్వరలో తెలియనుంది.
రాజశేఖర్ వరుస ఫ్లాప్ ల తర్వాత చాలా కాలానికి గరుడవేగా, కల్కి సినిమాలతో వరుస హిట్ లు కొట్టి ట్రాక్ లోకి వచ్చారు.ప్రస్తుతం `గరుడవేగ 2` సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.
త్వ రలోనే రాజశేఖర్ ‘మనం’ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తుంది.








